నిజామాబాద్ అర్బన్, జనవరి 23: రాష్ట్రస్థాయి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టిసెస్ అవార్డు-2020కి కలెక్టర్ నారాయణరెడ్డి ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ఎంపి క చేసిన ముగ్గురు అధికారుల్లో నిజామాబాద్ కలెక్టర్ ఉన్నారు. 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందజేయనున్నారు. నిజామాబాద్ అర్బన్‌కు చెందిన ఖనీజ్ ఫాతిమా బెస్ట్ బీఎల్‌ఈగా ఎంపికయ్యారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అవార్డుల జాబితాను విడుదల చేశారు.