రామచంద్రపురంలో కరోనా వైద్య సేవలు

ABN , First Publish Date - 2020-08-08T09:25:56+05:30 IST

రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి, చికిత్స అవసరమైన వ్యక్తులు సేవలు వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి చెప్పారు.

రామచంద్రపురంలో కరోనా వైద్య సేవలు

కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి 

ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌ వార్డు ప్రారంభం.. పాల్గొన్న మంత్రి వేణు


రామచంద్రపురం ఆగస్టు 7:  రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి, చికిత్స అవసరమైన వ్యక్తులు సేవలు వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం కొవిడ్‌ 19 పాజిటివ్‌ కేసుల వార్డును బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్‌ ప్రారంభించారు.


ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ ఇక్కడ  కొవిడ్‌ స్టెబిలైజేషన్‌ యూనిట్‌ అందుబాటులో ఉంటుందని, స్టెబిలైజేషన్‌ పూర్తయిన వ్యక్తులను పూర్తిస్థాయి కొవిడ్‌ వైద్య సేవలకు జిల్లా కొవిడ్‌ ఆసుపత్రులకు పంపిస్తామన్నారు. వార్డు ప్రారంభించిన అనంతరం మంత్రి, కలెక్టర్‌ కొంతమంది కరోనా బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో కొవిడ్‌ వైద్యాధికారి డాక్టర్‌ స్పందన, ఆర్డీవో ఎం.గాంధీ, డీఎస్పీ రాజగోపాలరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ టి.రాజగోపాలరావు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-08T09:25:56+05:30 IST