గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి

ABN , First Publish Date - 2020-09-27T11:11:45+05:30 IST

గర్భిణీ, బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శనివారం కలెక్టరేట్‌

గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి

- జిల్లా కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గర్భిణీ, బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోషణ అభియాన్‌ జిల్లా కన్వర్‌జెన్ని కమిటీ సమావేశం, పోషణ మాసం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల పెరుగుదల, గర్భిణి మహిళలు, బాలింతల పోషణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై అవగాహన తీసుకోవల్సిన జాగ్రత్తలు, రిపోర్టింగ్‌ సిస్టమ్స్‌ గురించి వివరించారు. పోషణ మాసంలో తీసుకున్న రెండు అంశాలు 15 రోజులు పిల్లలను బరువులు తీయడం, సామ్‌, మామ్‌, స్టటింగ్‌ గుర్తించడం, తదుపరి 15 రోజులు న్యూట్రీ గార్డెన్‌, కిచన్‌ గార్డెన్‌ నిర్వహించుకునే విధానాలు, స్వంత భవనాలు ఉన్న దగ్గర ఖాళీ స్థలం ఎంత ఉందని గుర్తించి కావలసిన విత్తనాలు, కూరగాయల మొక్కలు, పండ్ల చెట్లను, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ వారిని అనుసంధానం చేసుకోవలసిందిగా ఆదేశించారు.


ఈ నెల 1 నుంచి 30 వరకు పౌష్టికాహారం దినోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. సీడీపీవోలు, ఆశావర్కర్లు 6 సంవత్సరాల పిల్లలకు ఆహార లోపం ఉన్నట్లయితే గుర్తించి తర్వాత మెరుగయ్యే విధంగా వారికి పౌ్ట్టికాహారం(గుడ్లు, పాలు, ఆకు కూరలు) అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్‌ శారద, ట్రైని కలెక్టర్‌ అంకిత్‌, సీడీపీవోలు, ఏసీడీపీవోలు, సూపర్‌వైజర్లు, పోషణ అభియాన్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T11:11:45+05:30 IST