
పెరంబూర్(చెన్నై): కళ్లకుర్చి జిల్లా చిన్నసేలం ప్రాంతంలోని ఆదిద్రావిడ సంక్షేమ శాఖ హాస్టల్‌ను బుధవారం కలెక్టర్ పీఎన్ శ్రీధర్ తనిఖీ చేశారు. హాస్టల్ ప్రాంగణం, గదులు, మరుగుదొడ్లు తదితర ప్రాంతాల్లో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం విద్యార్థులతో కలసి డైనింగ్ హాలులో కింద కూర్చొని భోజనం చేసిన కలెక్టర్ ఆహార పదార్ధాల నాణ్యత పరిశీలించారు.
ఇవి కూడా చదవండి