ఖాళీ తట్టలతో నిరసన ప్రదర్శన చేస్తున్న జేఏసీ నాయకులు
ఖాళీ తట్టలతో వినూత్న నిరసన
నరసాపురం టౌన్,మార్చి 27: జిల్లా కేంద్రం విషయంలో ప్రజల మనోభావాలను ప్రభుత్వం గుర్తించాలని జేఏసీ కన్వీనర్ నెక్కంటి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆదివారం 55వ రోజు దీక్ష చేస్తున్న చిట్టవరం జనసేన యూత్‌కు సంఘీభావం తెలిపారు. పాలకులు స్పందించకపోయినా ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందన్న ఆశ ప్రజల్లో ఉందన్నారు.వనిత క్లబ్ సభ్యులు వనువులమ్మ ఆలయం వద్ద మగ్గాలు నేస్తూ నిరసన తెలిపారు.జిల్లా కేందం సాధనకు ఆదివారం రాత్రి జేఏసీ నాయకులు అంబేడ్కర్ సెంటర్ నుంచి ఖాళీ తట్టలు తలపై పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.దీక్షలో పైడికొండల కృష్ణ,శ్రీను, పోలిశెట్టి దుర్గప్రసాద్, నరేష్, ప్రశాంత్, అనంత్‌కుమార్, సత్యనారా యణస్వామి రఘురాం కూర్చున్నారు.కార్యక్రమంలో కలవకొలను తాతా జీ, పోలిశెట్టి సత్తి బాబు, కోటిపల్లి సురేష్, సాంబ, కంచర్ల నాగేశ్వరరావు,డాక్టర్ రాజ్యలక్ష్మి సుప్రజ, భరణి, భవాని, సర్వసతి తదితరులు పాల్గొన్నారు.