జిల్లా గ్రానైట్‌ లారీ అసోసియేషన్‌ కార్యవర్గం..

ABN , First Publish Date - 2020-11-30T05:00:06+05:30 IST

జిల్లా గ్రానైట్‌ లారీ, ట్రైలర్లు, లారీ ఓనర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఆదివారం బీఎస్‌జేఆర్‌ కళాశాల ప్రాంగణంలో ఎన్నుకున్నారు.

జిల్లా గ్రానైట్‌ లారీ అసోసియేషన్‌ కార్యవర్గం..
నూతన కార్యవర్గాన్ని అభినందిస్తున్న దృశ్యం

టెక్కలి, నవంబరు 29: జిల్లా గ్రానైట్‌ లారీ, ట్రైలర్లు, లారీ ఓనర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఆదివారం బీఎస్‌జేఆర్‌ కళాశాల ప్రాంగణంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిన్నాల వెంకట సత్య నారాయణ, గౌరవాధ్యక్షుడిగా ముడియా జానకిరామరెడ్డి, ఉపాధ్యక్షులుగా గూన శివకృష్ణ, శ్యామ్‌కుమార్‌, లక్ష్మీ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా అల్లు నగేష్‌లను ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా డి.రమేష్‌ బాబు, భూషన్‌రెడ్డి, జీరు పాపారావు, కోశాధికారులుగా వీఎన్‌ కిషోర్‌లతో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జానకిరామరెడ్డి మాట్లాడు తూ.. లారీ యజమానుల సంక్షేమం కోసం పాటుపడతామన్నారు. కార్య క్రమంలో జనార్దనరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2020-11-30T05:00:06+05:30 IST