జనసేన జిల్లా అఽధ్యక్షుడు దుర్గేష్‌కు ఘన స్వాగతం

Jul 23 2021 @ 00:56AM

పి.గన్నవరం, జూలై 22: జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు చాకలిపాలెంలో ఘనస్వాగతం లభించింది. జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి మొట్టమొదటిసారిగా కోనసీమ రావడంతో అమలాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ డియంఆర్‌ శేఖర్‌, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పితాని బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపరాణిలతోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు చాకలిపాలెంలో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక జనసేన నాయకులు కందాల చంటి నివాసంలో కందుల దుర్గేష్‌ను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వినాయకుని ఆలయంలో పూజలు చేశారు.  కార్యక్రమంలో అడబాల తాతకాపు, కొమ్ముల శివసాయి, తదితరులు పాల్గొన్నారు.

అంతర్వేది స్వామివారిని దర్శించుకున్న కందుల దుర్గేష్‌

అంతర్వేది, జూలై 22: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, డీఎంఆర్‌ శేఖర్‌, పితాని బాలకృష్ణ లు విచ్చేశారు. వారికి ఆలయ అర్చకులు, జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా జనసేన జిల్లా అధ్యక్షుడు అయిన కందుల దుర్గేష్‌ తొలిసారి నియోజకవర్గానికి రావడంతో తాటిపాక మొదలుకుని అంతర్వేది వరకు జనసేన నాయకులు ప్రత్యేక ర్యాలీతో రోడ్డుమార్గాన ఆలయానికి చేరుకు న్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక  పూజలు చేశారు. అంతర్వేది, కేశవదాసుపాలెం, చింతలమోరి మీదుగా మోరిపోడు చేరుకున్న అనంతరం ఇటీవల అగ్నికి ఆహుతైన ఇల్లు నిర్మాణం నిమిత్తం రుద్ర రమేష్‌కు జనసేన కార్యకర్తలు, జనసైనికులు కందుల దుర్గేష్‌ చేతుల మీదుగా రూ.10 లక్షలు సహాయాన్ని అందించారు. అలాగే  గెడ్డం మహలక్ష్మిప్రసాద్‌కు రూ.25వే లు అందించారు. కార్యక్రమంలో శెట్టిబత్తుల రాజబాబు, దిరిశాల బాలాజీ, తాడి మోహనకుమార్‌, గంటా స్వరూప, మద్దాల అమ్మాజీ, గుండుబోగుల పెద్దకాపు, రాయుడు నాగు, పినిశెట్టి బుజ్జి, జనసేన నాయకులు పాల్గొన్నారు. 

జనసేన జిల్లా అధ్యక్షుడు దుర్గేష్‌కు ఘనస్వాగతం

మలికిపురం, జూలై 22: జిల్లా జనసేన నూతన అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ రాజోలు నియోజకవర్గ పర్యటనకు రాగా లక్కవరంలో జిల్లాకాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

 రాజోలు పర్యటనకు వచ్చిన జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు జనసేన నాయకులు గుండుబోగుల పెదకాపు, దిరిసాల బాలాజీ, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్‌, తాడి మోహన్‌, రవికిరణ్‌, అంజి  స్వాగతం పలికారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.