7న మెగా లోక్‌అదాలత్‌

ABN , First Publish Date - 2020-10-24T11:08:22+05:30 IST

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నవంబరు 7న మెగా వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార..

7న మెగా లోక్‌అదాలత్‌

జిల్లా జడ్జి వీఆర్‌కే కృపాసాగర్‌


కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 23: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నవంబరు 7న మెగా వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు వీఆర్‌కే కృపాసాగర్‌ తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌ ద్వారా అన్ని రకాల కేసులు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌ సమావేశ హాలులో శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మెగా వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ వల్ల ఇరువర్గాలకు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా ఉధృతి సమయంలో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో రాజీ అయ్యే క్రిమినల్‌ కేసులన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు ఎ.పద్మ, వి.సత్యలక్ష్మి ప్రసన్న, డి.షర్మిల, ఎంవీఎన్‌ పద్మజ, జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కె.జానకిరామ్‌, కర్నూలు డీఎస్పీ బి.వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఉదయం జరిగిన మరో సమావేశంలో కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.మోహన్‌బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-24T11:08:22+05:30 IST