చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జీ

ABN , First Publish Date - 2021-10-26T05:30:00+05:30 IST

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జీ

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జీ
సమావేశంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి శైలజ

 శంభునిపేట, అక్టోబరు 26 : ప్రజలంద రూ చట్టాలపై అవగాహన పెంపొందింకోవాలని వరంగల్‌ జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ కె.శైలజ అన్నా రు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నాల్సా) సూచనలతో పాన్‌ ఇండియా అవేర్నెస్‌, ఔట్రీచ్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమంలో భాగంగా శంభునిపేట ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. జస్టిస్‌ శైలజ మాట్లాడుతూ ప్రజలకు న్యాయపరంగా ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు అందజేయాలని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు అందేలా న్యాయసేవాధికార సంస్థలు కృషి చేస్తాయన్నారు. లీగల్‌ సర్సీసెస్‌ ఆక్ట్‌, ఫ్రీ లీగల్‌ ఏయిడ్‌, పీసీపీఎ్‌సడిటి ఆక్ట్‌, వరకట్న నిషేద చట్టం, కార్మికుల సంక్షేమ చట్టాల పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ కుమారస్వామి, 42వ డివిజన్‌ కా ర్పొరేటర్‌ గుండు చందనపూర్ణచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

-------

 

Updated Date - 2021-10-26T05:30:00+05:30 IST