జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-01T06:35:25+05:30 IST

షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విశాఖపట్నం జిల్లా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కమ్‌ జిల్లా జట్టు ఎంపిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి.

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రారంభం
పోటీలను ప్రారంభిస్తున్న మేయర్‌, జీవీఎంసీ కమిషనర్‌

విశాఖపట్నం (స్పోర్ట్సు), జూన్‌ 30: షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విశాఖపట్నం జిల్లా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కమ్‌ జిల్లా జట్టు ఎంపిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. సింగిల్స్‌, డబల్స్‌ ఈవెంట్లలో అండర్‌-11, 13, 15, 17, 19 బాలుర బాలికల విభాగాలతో పాటు సీనియర్‌ పురుషులు, మహిళల కేటగిరిలో పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారులను త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నీకి ఎంపిక చేయనున్నారు. స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో పోటీలను మేయరు హరి వెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ యాదవ్‌, పల్లా శ్రీనివాస్‌, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. 


తొలిరోజు ఫలితాలివి...

బాలుర అండర్‌-11 కేటగిరీలో వైఎస్‌ఆర్‌ రిత్విక్‌, మోహిత్‌ అర్జున్‌, పి.రిత్విక్‌, త్రిభువన్‌, పి.గుణేష్‌వర్ధన్‌, టి.భార్గవ్‌, కె.మోజేష్‌, విశ్వంత్‌; బాలికల విభాగంలో పి.వేదిక, జోషితా, సమీక్ష పట్నాల, ఎస్‌కే సాహిదా, ఇ.ఆశ్రిత, ఎం.వాగ్దేవి, రాశికుమారి, అలియా లాల్‌చంద్‌; అండర్‌-11 బాలుర డబల్స్‌ విభాగంలో టి.భార్గవ్‌-వైఎస్‌ఆర్‌ రిత్విక్‌, కె.శ్రీహర్ష-అభినవ్‌, పి.రిత్విక్‌-బి.రీహాన్‌, త్రిభువన్‌-పుష్పక్‌; బాలికల విభాగంలో ఎం.వాగ్దేవి-అలియా లాల్‌చంద్‌, రాశికుమారి-జోషితా గెలుపొందారు. బాలుర అండర్‌-13 విభాగంలో ఎం.చరణ్‌, సి.విజయ్‌చరణ్‌, వరుణ్‌ సాయి, కె.రాహుల్‌, విశ్వంత్‌, సీహెచ్‌ నిఖిలేష్‌, కె.సృజన్‌, స్నేహిల్‌, కె.కార్తీక్‌, చద్విక్‌, జె.జెనిత్‌, రిత్విక్‌ రెడ్డి, హర్షవర్దన్‌; బాలికల విభాగంలో సీహెచ్‌ మోక్షజ్ఞ, జి.సంహిత, డీడీ సంజన, పి.వేదిక, సాహిద, వాగ్దేవి, జాస్మిన్‌; బాలుర డబల్స్‌లో హర్షవర్దన్‌-చరణ్‌, నికిలేష్‌-స్నేహిల్‌ విజయం సాధించారు.


3న జిల్లా స్థాయి చదరంగం పోటీలు

విశాఖపట్నం (స్పోర్ట్సు), జూన్‌ 30: ఆల్‌ విశాఖ చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 3న  గాయత్రి విద్యా మందిర్‌లో జిల్లా స్థాయి అండర్‌-9 బాలికలు, ఓపెన్‌ కేటగిరీ చెస్‌ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.మణికంఠ తెలిపారు. పోటీల్లో పాల్గొనే చిన్నారులు జనవరి ఒకటి, 2013న లేదా ఆ తర్వాత పుట్టినవారై ఉండాలని, ఆసక్తి గలవారు ఒకటోతేదీన 9393949697, 7989162930 నంబర్లకు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 


Updated Date - 2022-07-01T06:35:25+05:30 IST