కేంద్ర నిధుల జవాబుదారీకి జిల్లా స్థాయిలో పర్యవేక్షక కమిటీ

ABN , First Publish Date - 2021-03-02T06:01:04+05:30 IST

వివిధ రకాల పథకాలు, కార్యక్రమాల కోసం కేంద్రం విడుదల చేసే నిధులకు జవాబుదారీగా ఉండటానికి జిల్లా స్థాయిలో పర్యవేక్షక కమిటీని (డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

కేంద్ర నిధుల జవాబుదారీకి జిల్లా స్థాయిలో పర్యవేక్షక కమిటీ

కలికిరి, మార్చి 1: వివిధ రకాల పథకాలు, కార్యక్రమాల కోసం కేంద్రం విడుదల చేసే నిధులకు జవాబుదారీగా ఉండటానికి జిల్లా స్థాయిలో పర్యవేక్షక కమిటీని (డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రాలకు పంపుతున్న నిఽధులను పర్యవేక్షించడానికి ఇది వరకే డిల్లీలో జాతీయ స్థాయిలో పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌)ను ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్రాల వారీగా ఆయా రాజధానుల్లో నెలకొల్పారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో కేంద్ర పథకాల అమలు గురించి ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి డీపీఎంయూలను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని జాతీయ స్థాయి పీఎఫ్‌ఎంఎస్‌ గత జూన్‌లో రాష్ట్రాలకు సూచించింది.  ఏపీలో ఏడు డీపీఎంయూలను ఏర్పాటు చేయాలని కోరింది. దీనికనువుగా రాష్ట్రంలో రెండు జిల్లాలకు ఒక డీపీఎంయూ వంతున ఏర్పాటు చేయగా చిత్తూరు జిల్లాకు మాత్రం ప్రత్యేకించి ఒక డీపీఎంయూ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ యూనిట్‌కు అధ్యక్షుడుగా జిల్లా జాయింట్‌ కలెక్టరు వ్యవహరిస్తారు. జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టరు కన్వీనరు ఉంటారు. 

Updated Date - 2021-03-02T06:01:04+05:30 IST