జిల్లాలో జోరువాన

ABN , First Publish Date - 2022-01-18T05:12:08+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి జోరువాన కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది.

జిల్లాలో జోరువాన
గూడూరు రైతుబజారు సమీపంలో కురుస్తున్న వర్షం

స్తంభించిన జనజీవనం 


నెల్లూరు(హరనాథపురం), జనవరి 17 : జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి జోరువాన కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించింది. సంక్రాంతి తరువాత పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావటంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లి వర్షంలో తడిసి పోయారు. ప్రధాన, చిన్న రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరటంతో గుంతల మయమైన రోడ్లపై ప్రయాణించలేక వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక వైపు చలి... మరోవైపు కొవిడ్‌... వీటికి తోడు జలుబు, దగ్గులతో బాధ పడుతున్నవారిని ఈ వర్షం బాగా ఇబ్బంది పెట్టింది.  మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 


సగటు వర్షపాతం 12 మి.మీ

జిల్లాలో సోమవారం సగటు వర్షపాతం 12 మి.మీగా నమోదైంది. జిల్లాలో చిట్లమూరులో అత్యఽధికంగా 90.2 మి.మీ వర్షం పడగా, అత్యల్పంగా కావలిలో 0.8 మి.మీ వర్షం పడింది. 

Updated Date - 2022-01-18T05:12:08+05:30 IST