నియోజకవర్గానికి రూ. 5 కోట్లు

ABN , First Publish Date - 2022-06-26T06:52:29+05:30 IST

జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసు కుని వెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జిమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్రహోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

నియోజకవర్గానికి రూ. 5 కోట్లు
జిల్లా సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ చిత్రంలో హోం మంత్రి వనిత, ఎంపీ భరత్‌, కలెక్టర్‌, ఎస్పీ

సమస్యలన్నీ పరిష్కరిస్తాం 

 జిల్లా సమీక్షలో ఇన్‌చార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ


రాజమహేంద్రవరం, జూన్‌25(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసు కుని వెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జిమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్రహోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కలెక్టరేట్‌లో  శనివారం జిల్లాలోని అభి వృద్ధి పనులపై సమీక్షించారు.త్వరలో సీఎంతో మీటింగ్‌ ఉం టుందని,  వివిధ అభివృద్ధి పనులకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.5 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. నియోజకవర్గాలవారీ చేపట్టాల్సిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేయ డానికి ప్రజాప్రతినిధులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను సీఎం సమావేశంలో చర్చిస్తామన్నారు.రాష్ట్రంలో 33 లక్షల ఇళ్లుపట్టాల పంపిణీకి సీఎం ఆదేశించారన్నారు. సంక్షేమంతోపాటు, అభివృద్ధిని ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించి ప్రజాప్రతినిధులు ప్రజల గుర్తింపు  పొందాలన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణం మరమ్మతు  చేయాల్సిన రోడ్ల పనులకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర హోంమంత్రి  తానేటివనిత మాట్లాడుతూ జిల్లాలో నాడు నేడు పనులపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్‌ కె.మాధవీలత మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చిన ప్రతి అంశంపై నివేదిక సిద్ధం చేస్తామన్నారు. జిల్లా అధికారుల అంతా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న పనుల వివరాలను ఎంపీ,ఎమ్మెల్యేలకు తెలియజేయాలని ఆదేశించారు. ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ గోదావరి నాల్గో బ్రిడ్జి మీద కొవ్వూరు వైపు టోల్‌ప్లాజా ఒక్కటే ఉండడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని, దివాన్‌చెరువు వైపు కూడా టోల్‌ ప్లాజా ఉంటే మంచిదన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ సీతానగరంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సౌకర్యం ఉన్నా అనేక సమస్యలతో పూర్తి ఆయకట్టుకు నీరు వెళ్లడం లేదన్నారు. సమావేశంలో  నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాసులునాయుడు,  అనపర్తి ఎమ్మెల్యే  డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పలు సమస్యలను తెలిపారు. ఎస్‌పి ఐశ్వర్యరస్తోగి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టామన్నారు.


Updated Date - 2022-06-26T06:52:29+05:30 IST