జిల్లా వెయిట్‌ లిఫ్టర్‌ కార్తిక్‌కు స్ట్రాంగ్‌మెన్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2021-03-01T05:41:43+05:30 IST

రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టిం గ్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన కార్తిక్‌ స్ర్టాంగ్‌మెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లాల్‌బహద్దూర్‌ స్టేడియంలో శనివారం ఈ పోటీలు జరిగాయి.

జిల్లా వెయిట్‌ లిఫ్టర్‌ కార్తిక్‌కు స్ట్రాంగ్‌మెన్‌ టైటిల్‌
కార్తిక్‌కు టైటిల్‌ను అందజేస్తున్న దృశ్యం

89 కేజీల విభాగంలో కార్తిక్‌కు, 61 కేజీల విభాగంలో రాజ్‌కుమార్‌కు గోల్డ్‌మెడల్‌
సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 28 : రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టిం గ్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన కార్తిక్‌ స్ర్టాంగ్‌మెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లాల్‌బహద్దూర్‌ స్టేడియంలో శనివారం ఈ పోటీలు జరిగాయి. సు మారు 5 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో 59 కేజీల విభాగంలో కార్తిక్‌ 128 కేజీలు, 165 కేజీలతో మొత్తం 293 కేజీ ల బరువు ఎత్తి గోల్డ్‌మెడల్‌ సాధించడమేకాకుండా మొత్త ంలో అత్యధిక బరువు ఎత్తి స్ర్టాంగ్‌మెన్‌ టైటిల్‌తో పాటు బెస్ట్‌ లిఫ్టర్‌ అవార్డు అందుకున్నాడు. 61 కేజీల విభాగంలో రాజ్‌కుమార్‌ 80 కేజీల జర్క్‌ విభాగంలో 100 కేజీలు స్కా చ్‌ విభాగంలో బరువు ఎత్తి గోల్డ్‌మెడల్‌ సాధించాడే. ఇరు వురు మార్చిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. గోల్డ్‌మెడల్‌ సాధించిన క్రీడాకారులను జిల్లా వెయి ట్‌ లిఫ్టింగ్‌కు చెందిన సాయిలు, శ్రీనివాస్‌, జైపాల్‌ తదితరులు అధినందించారు.

Updated Date - 2021-03-01T05:41:43+05:30 IST