ఆర్టీసీలో కలవరం

ABN , First Publish Date - 2020-07-06T10:38:47+05:30 IST

కరోనా మహమ్మారి ఆర్టీసీకి కూడా పాకింది. ఇప్పటికే ఓ డ్రైవర్‌కు వైరస్‌ సోకగా రెండు రోజుల క్రితం ..

ఆర్టీసీలో కలవరం

ఓ డ్రైవర్‌, కార్యాలయ సిబ్బందికి  పాజిటివ్‌

ఉద్యోగులు, ప్రయాణికుల ఆందోళన

అమలుకాని నిబంధనలు


నెల్లూరు (క్రైం), జూలై 5 : కరోనా మహమ్మారి ఆర్టీసీకి కూడా పాకింది. ఇప్పటికే ఓ డ్రైవర్‌కు వైరస్‌ సోకగా రెండు రోజుల క్రితం ఓ డిపో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ ఉద్యోగితోపాటు విఽధులు నిర్వహించే 19 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ఇలా ఆర్టీసీ సిబ్బంది కరోనా బారిన పడటంతో అటు ఉద్యోగులు, ఇటు ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. నెల్లూరు రీజియన్‌లోని పది డిపోల నుంచి రోజుకు 130 బస్సులు నడుపుతున్నారు.


వాటిలో నిత్యం వేల మంది ప్రయాణిస్తున్నారు. అయితే బస్సుల్లో, బస్టాండుల్లో కోవిడ్‌-19 నిబంధనలు, అధికారుల ఆదేశాలు, సూచనలు అమలవుతున్నాయా?, లేదా? అనేదానిపై పర్యవేక్షణ కొరవడుతున్నట్లు ఆరోపణలున్నాయి. బస్టాండ్లలో కరోనా నియంత్రణకు కనీస జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలా లు లేవు. ప్రయాణికులు భౌతిక దూరాన్ని విస్మరించి గుంపులు గుంపులుగా ఉంటున్నా పట్టించుకునేవారు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిణామాలు తీవ్రంగా మారే ప్రమాదం ఉంది.

Updated Date - 2020-07-06T10:38:47+05:30 IST