కలవరం

Published: Fri, 28 Jan 2022 00:05:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కలవరంకరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరి(ఫైల్‌)

- విజృంభిస్తున్న కరోనా

- థర్డ్‌ వేవ్‌లో పెరిగిన పాజిటివ్‌ రేటు

- దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న ప్రజలు

- ప్రతి ఇద్దరిలో ఒకరికి కొవిడ్‌ నిర్ధారణ

మంచిర్యాల, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కరోనా థర్డ్‌ వేవ్‌లో కేసులు పెరుగుతుండడంతో జిల్లా వాసులు కలవరపడు తున్నారు.. గత కొద్ది రోజులుగా తీవ్రంగా విజృంభిస్తున్న కొవిడ్‌ వైరస్‌ కారణంగా దగ్గు, జలు బు, జ్వరంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతుండగా ప్రతి ఇద్దరిలో ఒకరు లక్షణాలతో బాధపడుతున్నారు. థర్డ్‌ వేవ్‌లో చెప్పుకోదగిన విధంగా పరిస్థి తి చేయి దాటకపోయినా పాజిటివ్‌ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో ఒకరిద్దరికీ కొవిడ్‌ సోకిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత ఐదారు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రమాదకర స్థితితో పెరుగుతుండగా ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు వెళు తున్న వారిలో దాదాపు 90 శాతం మందికి కొవిడ్‌ నిర్ధారణ అవుతుండ డం ఆందోళనకు దారితీస్తోంది. థర్డ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతున్నప్పటికీ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణ లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న వారికి సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

-జ్వర సర్వే వేగం పెంపు..

ఽథర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్ర మత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ విరివిగా పరీక్షల సంఖ్య పెంచింది. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచింది. వీటితోపాటు ఫీవర్‌ సర్వేలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సర్వేను వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 485 టీంలను ఏర్పాటు చేశారు. అ మేరకు అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లో ఇంటింటా సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు గణనీయంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి నిరవధికంగా ఫీవర్‌ సర్వే ప్రారంభం కాగా బృందాల సభ్యులు ఇంటింటిని సందర్శించి లక్షణాలున్న వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో భాగంగా జ్వ రం, దగ్గు, జలుబు, తదితర, లక్షణాలున్న వారికి ప్రభుత్వపరంగా సరఫ రా చేస్తున్న ఐదు రోజులకు సరిపడే మెడికల్‌ కిట్‌ను సిబ్బంది అక్కడి కక్కడే బాధితులకు అందజేస్తున్నారు. ఈ ఐదు రోజుల పాటు ప్రతి దినం బాధిత ఇళ్లకు వెళ్తున్న సిబ్బంది ప్రజల ఆరోగ్య స్థితిగతులపై విచారణ జరుపుతున్నారు. ఐదు రోజుల అనంతరం లక్షణాలు తగ్గని పక్షంలో బాధితులను సమీపంలోని పీహెచ్‌సీలకు తరలించి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పక్షంలో బాఽధితులను హోం ఐసోలేషన్‌లో ఉంచుతూ చికిత్స అందిస్తున్నారు. 

- టీకా పంపిణీపై..

ఽథర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ టీకా పంపిణీపై పూర్తిస్థాయిలో ధృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అసలే కొవిడ్‌  టీకా తీసుకోనివారు, రెండో డోసు బకాయి ఉన్న వారికి విరివిగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బాలు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి ఫయాజ్‌ఖాన్‌లు జిల్లా కేంధ్రంలోని శ్రీశ్రీ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. 16 మంది ఏఎన్‌ఎంలు, ఆర్పీలు, అంగన్‌వాడీ టీచర్లతో కూడిన 14 బృందాలతో  ఇంటింటా వాకబు చేస్తూ అర్హులైన లబ్దిదారు లకు టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా, మొదటి డోసు 76 మందికి, రెండో డోసు 242 మందికి ఇచ్చారు. నూరు శాతం లక్ష్యం పూర్తి చేయడం ద్వారా కొవిడ్‌ విజృంభణకు బ్రేకులు వేసేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికా రులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. 

-ఫీవర్‌ సర్వేలో భాగంగా..

ఫీవర్‌ సర్వేలో భాగంగా జిల్లాలోని 2 లక్షల 30వేల 839 ఇళ్లను సంద ర్శించేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీలు, 311 గ్రామ పంచాయితీల పరి ధిలో 2,30,839 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో గడిచిన ఆరు రోజుల్లో 98,326 ఇళ్లలో సిబ్బంది సర్వే పూర్తి చేశారు. గత ఆరు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న 4,740 మందిని గుర్తించగా వారికి 5 రోజులకు సరిపడా మందుల కిట్లు అంద జేశారు. ఈ నెల 26 వరకు జిల్లాలో 4,009 యాక్టివ్‌ కేసులు ఉండగా కొ విడ్‌ లక్షణాలతో బాధపడుతున్న 78 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరి చికి త్స పొందుతున్నారు. వీరిలో 72 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 6గురు ప్రైవేటులో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.