ఉద్యోగం పోయింది.. ఇల్లు గడవడం లేదు.. నీ నగలు అమ్మేద్దాం.. అని ఓ భర్త ప్రపోజల్.. నో చెప్పిన భార్య.. చివరకు..

ABN , First Publish Date - 2021-09-17T19:29:28+05:30 IST

అతను ఓ ఫ్యాక్టరీ క్యాంటీన్‌లో పనిచేసేవాడు.. ఆ డబ్బులతోనే భార్యను, నలుగురు పిల్లలను పోషించేవాడు..

ఉద్యోగం పోయింది.. ఇల్లు గడవడం లేదు.. నీ నగలు అమ్మేద్దాం.. అని ఓ భర్త ప్రపోజల్.. నో చెప్పిన భార్య.. చివరకు..

అతను ఓ ఫ్యాక్టరీ క్యాంటీన్‌లో పనిచేసేవాడు.. ఆ డబ్బులతోనే భార్యను, నలుగురు పిల్లలను పోషించేవాడు.. ఇటీవల అతని ఉద్యోగం పోయింది.. దీంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.. డబ్బు అవసరం పడడంతో అతను తన భార్య నగలను విక్రయించాలనుకున్నాడు.. అయితే అందుకు ఆమె ఇష్టపడలేదు.. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. గత బుధవారం రాత్రి ఆ గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.. క్షణికావేశానికి లోనైన అతను భార్య గొంతు నులిమి చంపేశాడు.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ఘటన జరిగింది. 


అజ్మీర్‌కు చెందిన లక్ష్మణ్‌సింగ్ రావత్ (52) హెచ్‌ఎమ్‌టీ ఫ్యాక్టరీ క్యాంటిన్‌లో పనిచేసేవాడు. ఇటీవల తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. దీంతో అర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో భార్య నగలు అమ్మి కష్టాల నుంచి గట్టెక్కాలనుకున్నాడు. అందుకు అతని భార్య లీలా దేవి అంగీకరించలేదు. దీంతో వారిద్దరి మధ్య తరచుగా వాగ్వాదాలు జరిగేవి. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి గొడవ మొదలైంది. ఇద్దరూ వాదించుకున్నారు. 


ఇవి కూడా చదవండి

గ్యాస్ డెలివరీ కోసం ఆర్మీ క్యాంప్‌లోకి.. నిఘా వేసి ఫోన్‌ను చెక్ చేస్తే..



బైక్‌పై వెళ్తూ ఓవర్‌టేక్ చేయబోయాడు.. బస్సు కింద పడినా..



క్షణికావేశానికి గురైన లక్ష్మణ్ సింగ్.. తన భార్య లీల గొంతు నులిమి చంపేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో చిన్న కొడుకు అక్కడే ఉన్నాడు. సమాచారం అందుకున్న రామగంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన భార్యను గొంతు నులిమి చంపినట్టు నిందితుడు స్వయంగా పోలీసులకు చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మణ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-09-17T19:29:28+05:30 IST