ఏపీలో డైవర్షన్ రాజకీయాలు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2022-01-28T23:57:37+05:30 IST

ఏపీలో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఏపీలో డైవర్షన్ రాజకీయాలు: దేవినేని ఉమా

కృష్ణా: ఏపీలో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళన, గుడివాడ క్యాసినో వ్యవహారంపై ప్రజల దృష్టిని మళ్లించడానికే జిల్లాల విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. గుడివాడలో గోవా సంస్కృతిని తీసుకురావడం సిగ్గుచేటన్నారు. గుడివాడ క్యాసినోలో సీఎం జగన్, డీజీపీ మహేందర్ రెడ్డికి వాటాలున్నాయని ఆరోపించారు. సీఎం అండతోనే బూతుల మంత్రి ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారని ఉమా మండిపడ్డారు.


‘‘రాష్ట్ర కేబినెట్ క్యాసినో కేబినెట్ అయ్యింది. రైతులను గాలికొదిలేసి పేకాట క్లబ్‌లకు రాష్ట్రం నిలయంగా మారింది. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం నుంచి వచ్చిన సొమ్మును బూతుల మంత్రి కొట్టేస్తే.. ఈడీ అధికారులు వంద కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బులు ఎవరివో సీఎం, బూతులు మంత్రి చెప్పాలి? రాష్ట్ర సంపదను జగన్‌రెడ్డి ప్రభుత్వం లూటి చేస్తోంది’’ అని దేవినేని ఉమా ధ్వజమెత్తారు.


Updated Date - 2022-01-28T23:57:37+05:30 IST