కరోనాతో డివిజన్‌ స్థాయి పోలీస్‌ అధికారి మృతి

ABN , First Publish Date - 2021-04-19T04:52:31+05:30 IST

న్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు సైతం పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో అధికారి పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతిచెందారు. ఈ విషయం భార్య, ఇద్దరు పిల్లలకు తెలియదు. కనీసం కడచూపును కూడా వారు నోచుకోలేదు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలానికి చెందిన ఈయన ఎస్‌ఐగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సీఐ, డీఎస్పీగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల పనిచేశారు. ఆయన అకాల మరణంతో పోలీస్‌ శాఖలో విషాదం అలముకుంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ రాజకుమారి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కరోనాతో డివిజన్‌ స్థాయి పోలీస్‌ అధికారి మృతి



విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 18: కొవిడ్‌తో పోలీస్‌ శాఖ డివిజన్‌ స్థాయి అధికారి ఒకరు ఆదివారం మృతిచెందారు. కొద్దిరోజుల కిందట కొవిడ్‌బారిన పడిన ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు సైతం పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో అధికారి పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతిచెందారు. ఈ విషయం భార్య, ఇద్దరు పిల్లలకు తెలియదు. కనీసం కడచూపును కూడా వారు నోచుకోలేదు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలానికి చెందిన ఈయన ఎస్‌ఐగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సీఐ, డీఎస్పీగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల పనిచేశారు. ఆయన అకాల మరణంతో పోలీస్‌ శాఖలో విషాదం అలముకుంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ రాజకుమారి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 



Updated Date - 2021-04-19T04:52:31+05:30 IST