దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-12-04T04:57:05+05:30 IST

దివ్యాంగులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మహిళ శిశుసం క్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు.

దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటాం
వీల్‌చైర్‌ అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్‌

 వర్చువల్‌ మీటింగ్‌లో మహిళ శిశుసంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ 

 జిల్లాలో పలు ప్రాంతాల్లో  దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ

నెట్‌వర్క్‌: దివ్యాంగులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మహిళ శిశుసం క్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. గురువా రం వర్చువల్‌ మీటింగ్‌ ద్వారా పాతమండలపరిషత్‌ కార్యాలయం రఘునాధపాలెం, రోటరీనగర్‌ నందు ప్రపం చ దివ్యాంగు ల దినోత్సవ కార్యక్రమం నిర్వ హించారు. ఈకార్యక్రమా నికి మహిళ శిశుసంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ ప్రసంగిస్తూ దివ్యాంగులకు వివిధ రంగాల్లో ఉన్నతస్థాయి లో ఉన్నారని, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభ త్వం అందిస్తుందన్నారు. వర్చువల్‌ మీటింగ్‌లో ఖమ్మం మహిళ శిశుసంక్షేమ అధికారిణి సంధ్యారాణి మాట్లాడు తూ దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అందిస్తు న్నామని, వారిని అన్ని విదాల ఆదుకుంటామని తెలిపారు. మహిళ శిశు,వికలాంగుల డైరెక్టర్‌ శైలజ, డీఆర్‌డీఏ సిబ్బంది దాలయ్య, సుకన్య, ఉప్పలయ్య, దివ్యాంగుల నాయకులు పాల్గొన్నారు.


దివ్యాంగులకు న్యాయసేవలు: జిల్లా జడ్జీ లక్ష్మణ్‌


న్యాయసేవా సంస్థల చట్ట ప్రకారం దివ్యాంగులు ఉచిత న్యాయసేవలకు అర్హులని వారికి జిల్లా, మండల న్యాయసేవాసంస్థల ద్వారా న్యాయసహాయం అందిస్తామ ని జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి, న్యాయసేవా సంస్థల జిల్లాచైర్మన్‌ ఎం.లక్ష్మణ్‌ అన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం న్యాయసే వాసదన్‌లో సమావేశం నిర్వహించారు. చట్టపరమైన న్యాయసేవలు అందిస్తున్న న్యాయసేవాసంస్థ, 2018నుంచి ప్రభుత్వ పథకాలు దివ్యాం గులకు అందకపోయినా ఆ కేసులను సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా పరిష్కరిస్తన్నట్టు తెలిపారు. దివ్యాంగులకు కృత్తిమ అవయవాలు అందించ డంలో రోటరీక్లబ్‌ పాత్రనున్యాయ మూర్తి అభినందించారు. దివ్యాంగుల హక్కులను వారికి న్యాయసహాయం అందించే ప్రక్రియను సీనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అప్రోజ్‌ అక్తర్‌ వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి  ముగ్గురికి కృత్రిమ అవయవాలు, ఇద్దరు బాల దివ్యాంగులకు వినికిడి యత్రాలు, మరొక దివ్యాంగుడికి చక్రాల కుర్చీ అందించారు. ఈకార్యక్రమంలో రోటరీసభ్యు డు న్యాయసేవాసంస్థ సభ్యుడు, న్యాయవాది మల్లాది వాసుదేవరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిపుడి తాజుద్దీన్‌బాబా, రోటరీ సెక్రటరి సాంబశివరావు, గణేష్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో  ప్రపంచ దివ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. పలు ప్రాంతాల్లో దివ్యాంగుకులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.


Updated Date - 2020-12-04T04:57:05+05:30 IST