రాజీనామా తర్వాత చంద్రబాబుపై దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-02T18:30:13+05:30 IST

టాలీవుడ్ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి (DivyaVani) రాజీనామా (Resign) వ్యవహారం రెండ్రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే..

రాజీనామా తర్వాత చంద్రబాబుపై దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ సిటీ : టాలీవుడ్ నటి, టీడీపీ అధికార  ప్రతినిధి దివ్యవాణి (DivyaVani) రాజీనామా (Resign) వ్యవహారం రెండ్రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుతో (Chandrababu).. దివ్యవాణి కలిసొచ్చిన తర్వాత ఇక అంతా ప్రశాంతం అనుకునే లోపే ఇవాళ ఉదయం ఉన్నట్టుండి.. అదంతా తూచ్ అన్నట్లుగా.. రాజీనామా చేసేస్తున్నానని ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. అనంతరం ఆమె హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించి.. అసలు తానెందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది..? టీడీపీలో (TDP) ఆమె పరిస్థితి ఎలా ఉండేది..? ఇలా పలు విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


గుర్తింపు లేదు..!

బుద్ధి లేని వాళ్లు బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందిందని కొందరు అంటున్నారు.. అవన్నీ ఏమీ  కాదు.. ప్యాకేజీ కోసమే నేను రాజీనామా చేయడం లేదు. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఇప్పటి వరకూ ఆగాను. ఏడాదిగా నాకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు. భువనేశ్వరిపై కొందరు వ్యాఖ్యలు చేసినప్పుడు... నేనే చాలా గట్టిగా తిప్పికొట్టాను. పార్టీలో నా స్థానం ఏంటో తెలియని పరిస్థితి. ఆఫీస్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మా నేతల చుట్టూ తిరిగినా కనీసం స్పందన లేదు. నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే టీడీపీలో సేవ చేశాను.. కానీ ఏడాది నుంచి పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ప్రజలకు చంద్రబాబు మంచి చేస్తారనే టీడీపీలో చేరానుఅని మాట్లాడుతూ దివ్యవాణి తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.


ఎప్పుడైనా ఇదే మాట చెబుతా..!

చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడు.. ఇప్పుడే కాదు.. ఈ మాట ఎప్పుడైనా ఇదే చెబుతాను.  నేను ఎప్పుడూ భజన చేయను. ఎవరూ చెప్పని నిజాలు చెబుతున్నానని అందరూ ప్రశంసించారు. చంద్రబాబు ఇప్పటికీ హైదరాబాద్‌ నుంచే వచ్చి వెళుతున్నారు. నేను కూడా హైదరాబాద్‌ నుంచే వచ్చి వెళుతున్నాను. ఎవరితో మీడియా మీట్ నిర్వహించి మాట్లాడించాలో ముందే అనుకుని మాట్లాడిస్తారు. నేను చెప్పాల్సిన అంశాలను ఇతర నేతలతో చెప్పించారు. అధినేతను కొందరు రాంగ్‌ రూట్‌లోకి తీసుకెళుతున్నారు. చంద్రబాబును ఎవరైనా ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేనుఅని దివ్యవాణి చెప్పుకొచ్చారు.



Updated Date - 2022-06-02T18:30:13+05:30 IST