వరకట్నం వేధింపులపై కేసు

ABN , First Publish Date - 2021-01-24T06:31:18+05:30 IST

కట్నం వేధింపులపై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అమలాపురం పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తెలిపారు.

వరకట్నం వేధింపులపై కేసు

అమలాపురం టౌన్‌, జనవరి 23: కట్నం వేధింపులపై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అమలాపురం పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తెలిపారు. అల్లవరం మండలానికి చెందిన మౌనిక(27)కు అమెరికాలో స్థిరపడ్డ కోసూరి హరీష్‌వర్మతో 2019లో వివాహమైంది. కట్నం క్రింద రూ.50లక్షలు, పది కాసుల బంగారం ఇచ్చారు. పుట్టింటి వారు ఆమెకు ఇచ్చిన 50తులాల బంగారు ఆభరణాలు, 2కిలోల వెండి వస్తువులు తమ వద్ద ఉంచుతామని అత్తమామలు ఉమాలక్ష్మి, రమేష్‌లు తీసుకున్నారు. హరీష్‌వర్మ సొరియాసిస్‌ వ్యాధితో బాధపడుతున్న విష యాన్ని రహస్యంగా ఉంచి వివాహం జరిపించారు. మోసంచేసి వివాహం చేశారని ప్రశ్నించినందుకు  భర్త, అత్తమామలు,  బావ వివేక్‌వర్మలు ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. పుట్టింటికి వెళ్లిపోతే రూ.కోటి తీసుకువస్తేనే తిరిగి రానిచ్చేది లేదని ఆమెను వారు హెచ్చరించారు. దీంతో  బాధలు తాళలేక సోదరుని సహ కారంతో 2019 డిసెంబరు 25న అమెరికా నుంచి వచ్చి అమలాపురంలోని పెదతండ్రి వద్ద ఉంటోంది.  కట్నంతో పాటు  తన వద్ద నుంచి తీసుకున్న ఆభరణాలను తిరిగి ఇప్పించి,  అత్తింటివారి నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో తనకు,  కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈనెల21న కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్‌ తెలిపారు. 



Updated Date - 2021-01-24T06:31:18+05:30 IST