
హైదరాబాద్: ప్రధాని మోదీని తిట్టడానికే కేసీఆర్ ప్రెస్మీట్లు అని అర్థమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతామని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల ఖాతాల్లో అడ్వాన్స్‌గా డబ్బులు వేస్తే వాళ్లే డిస్కంలకు కట్టుకుంటారని చెప్పారు. రైతుల బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. దళితబంధు పథకం ఎస్సీల కోసమా.. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమా? అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం ఏంటి? అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం కుర్చీ పర్మినెంట్ కాదని ఉద్యోగులు గుర్తించాలన్నారు.
ఇవి కూడా చదవండి