నూరు శాతం పన్నులు వసూలు చేయాలి

Published: Fri, 21 Jan 2022 22:19:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నూరు శాతం పన్నులు వసూలు చేయాలిరికార్డులు తనిఖీ చేస్తున్న డీఎల్‌పీవో రమేష్‌

ఉదయగిరి రూరల్‌, జనవరి 21: పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని పంచాయతీల్లో అన్ని రకాల పన్నుల వసూలును నూరు శాతం పూర్తి చేయాలని కావలి డీఎల్‌పీవో రమేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కొండాయపాళెం, తిరుమలాపురం పంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు అమర్‌నాధ్‌రెడ్డి, సుధాకర్‌, నాగూర్‌బీ, సర్పంచు కె.కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.