Advertisement

దామర్‌చెడ్‌ ఉపసర్పంచ్‌పై డీఎల్పీవో విచారణ

Jan 23 2021 @ 23:43PM

బషీరాబాద్‌: దామర్‌చెడ్‌ ఉపసర్పంచ్‌పై తాండూరు డివిజన్‌ డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ శనివారం విచారణ జరిపారు. బషీరాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఉపసర్పంచ్‌ శాంతుపై సర్పంచ్‌ నర్సిరెడ్డి ఫిర్యాదు చేయడంతో డీఎల్‌పీవో విచారించారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ మధ్య గొడవకు కారణాలపై తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచయాలని సూచించారు. ఈ విచారణ సమయంలో మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు మల్లేషం ఉపసర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను డీఎల్పీవో దృష్టికి తీసుకెళ్లారు.

Follow Us on:
Advertisement