వ్యాక్సిన్‌తోనే కరోనా నివారణ

ABN , First Publish Date - 2021-03-06T05:33:04+05:30 IST

వ్యాక్సిన్‌తోనే కరోనా నివారణ

వ్యాక్సిన్‌తోనే కరోనా నివారణ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అప్పయ్య

డీఎంహెచ్‌వో డాక్టర్‌ అప్పయ్య


ములుగు,మార్చి 5: వ్యాక్సిన్‌తోనే కరోనా నివా రణకు మార్గం సులభమవుతుందని, వృద్ధులు, దీర్ఘకా లిక వ్యాధులున్నవారు అపోహలు వీడి ధైర్యంగా ముందుకు రావాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య కోరారు. శుక్రవారం ములుగులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాగా జిల్లావా సులు ఆసక్తి కనబర్చకపోవడం ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. యావత్‌ ప్రపంచాన్ని కట్టిపడేసిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే టీకా అంతిమ ఆయుధమని, ప్రతీ ఒక్కరు అవగాహన పెంచు కోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 45నుంచి 59ఏళ్లలోపు వయసుగల వారు సుమారు 48వేలమంది ఉన్నారని, ఇటీవల జరిపిన ఇంటింటి సర్వేలో వీరిలో చాలా మందికి బీపీ, షుగర్‌ వంటి 20రకాల దీర్ఘకాలిక వ్యాధులున్నట్లు స్పష్టమైదన్నారు. మొత్తం జనాభాలో 10శాతం 60ఏళ్ల పైబడినవారున్నారు. అయితే ఈనెల 1వతేదీనుంచి టీకా పంపిణీ ప్రారంభం కాగా రోజుకు 200మందికి  వ్యాక్సిన్‌ వేసే అవకాశముండగా ఇప్పటి వరకు కేవలం 22మంది మాత్రమే టీకా వేసు కున్నారని తెలిపారు. వృద్ధుల్లో యాంటీబాడీలు తక్కువగా ఉంటాయని, కరోనాను ఎదుర్కోవాలంటే టీకా తప్పకుండా తీసుకోవాలని అన్నారు. కొవిన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదుచేసుకునేందుకు అవగాహన లేకుంటే నేరుగా ఆస్పత్రికి వస్తే వైద్యులు, సిబ్బంది పరీక్షించి ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేస్తారని వెల్ల డించారు. ములుగు ఏరియా వైద్యశాలతో పాటు ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామని తెలిపారు. తొలుత హెల్త్‌కేర్‌ వర్కర్లకు మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వగా 2276మంది పోర్టల్‌లో నమోదు చేసుకుంటే 1617మంది టీకా వేసుకున్నారు. రెండో విడతలో 2572మంది రెవెన్యూ, పంచాయతీ, పోలీసు సిబ్బంది పేర్లు నమోదుచేసుకోగా 1168మంది టీకా తీసుకున్నారన్నారు. మిగతా వారు కూడా టీకా తీసు కునేందుకు అర్హులేనని, సమీపంలోని ఆస్పత్రులను సంప్రదించాలని సూచించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45నుంచి 59ఏళ్లలోపు వారు గుర్తింపు పొందిన డాక్టర్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలని, నేరుగా ఆస్పత్రికి వచ్చినా వైద్యులు  ధ్రువీకరణ పత్రం ఇస్తారని స్పష్టంచేశారు. లబ్ధిదారులను టీకా కేంద్రానికి తీసుకువచ్చేందుకు ఉచిత ప్రయాణ ఏ ర్పాట్లు చేసేవిషయమై కలెక్టర్‌ అనుమతి తీసు కుంటామని అప్పయ్య వెల్లడించారు. అర్హులైన ప్రతీ ఒక్కరు కరోనా టీకా వేయించుకోవడం ద్వారా వ్యాధి రహిత జిల్లా ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

Updated Date - 2021-03-06T05:33:04+05:30 IST