పోలియో రహిత సమాజానికి కృషి

ABN , First Publish Date - 2020-10-25T10:47:58+05:30 IST

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌ పిలుపునిచ్చారు.

పోలియో రహిత సమాజానికి కృషి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌  పిలుపునిచ్చారు. ప్రపంచ పోలియో నిర్మూలన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో శని వారం నగ రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో నిర్మూలనకు రోటరీక్లబ్‌ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయ మన్నారు. పక్కదేశాలైన పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఇప్పటికీ పోలియో కేసులు నమోదవుతున్నాయన్నారు.


అనంతరం ఉత్తమసేవలకు గాను రోటరీ తరఫున వైద్యులు కృష్ణమోహన్‌, విజయ్‌కు మార్‌, పీహెచ్‌ఎన్‌ విజయప్రభ, ఎమ్పీహెచ్‌ఎస్‌ లక్ష్మి, ఫార్మసిస్ట్‌ నరసింహం, వీఎల్‌ఎం పాపారావు, వీసీసీఎం పృద్వి, రిఫ్రిజరేటర్‌ మెకానిక్‌ వెంకటేశ్వరరావు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ హేమంత్‌కుమార్‌, వార్డు హెల్త్‌ సెక్రటరీలు చిన్న మ్మడు, జి.ఈశ్వర మ్మ, జి.కుమారి, ఆశ కార్యకర్తలు ఆదిలక్ష్మి, చీపురు లక్ష్మి, కాంచనలకు పురస్కారాలు అందజేశారు.  కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో జగన్నాథరావు, రోటరీక్లబ్‌ అధ్యక్షులు ఎంఆర్‌కే దాస్‌, కృష్ణమోషన్‌, మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T10:47:58+05:30 IST