మాతృమరణాలు నివారించాలి

ABN , First Publish Date - 2021-03-07T04:38:21+05:30 IST

జిల్లాలో మాతృమరణాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి వెల్లడించారు.

మాతృమరణాలు నివారించాలి
చిత్ర ప్రదర్శనలను వీక్షిస్తున్న డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి

సమీక్షలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి

నెల్లూరు (వైద్యం), మార్చి 6: జిల్లాలో మాతృమరణాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి వెల్లడించారు. శనివారం జిల్లాలో జరిగిన 3 మాతృమరణాలపై డీఎంహెచ్‌వో చాంబర్‌లో కమిటీతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ఆశా, ఆరోగ్య కార్యకర్తలు పర్యవేక్షణ చేయాలన్నారు. రక్తహీనత ఉన్న వారిని గుర్తించి సుఖప్రసవం అయ్యేలా చూడాలని తెలిపారు. జిల్లాలో మానవ తప్పిదం వల్ల ఏ ఒక్క మాతృమరణం సంభవించరాదన్నారు. ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ ప్రభావతి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వర్ణలత, డాక్టర్లు రాధ, లలితాశేఖర్‌, శోభారాణి, కవితారాణి, సురేష్‌, నీరజ, పద్మజ, వరలక్ష్మి, డీఐవో డాక్టర్‌ శెరీనాకుమారి, డెమో మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థి మంచి శాస్త్రవేత్తగా ఎదగాలి

నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట) : ప్రతి విదార్థి మంచి శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి ఉపయోగపడాలని డీఎంహెచ్‌వో ఎస్‌ రాజ్యలక్ష్మి సూచించారు. భారతీయ విజ్ఞాన మండలి, రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా నిర్వహించే ప్రతిభాన్వేషణ జిల్లాస్థాయి పోటీలు శనివారం నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగాయి. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వారిలో దాగివున్న నైపుణ్యాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ పోటీలో 36 పాఠశాలల విద్యార్థులు పాల్గొని పోస్టర్‌ ప్రజెంటేషన్‌ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర సహకార్యవాహ దువ్వూరు యగంధర్‌, కౌశల్‌ జిల్లా సమన్వయకర్త ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రసాద్‌, రాష్ట్ర సమన్వయ కర్త పూడి వెంకటప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:38:21+05:30 IST