చనుగొండ్లలో పర్యటించిన డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2021-12-04T05:15:10+05:30 IST

మండలంలోని చనుగొండ్ల గ్రామంలో డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య శుక్రవారం పర్యటించారు. చనుగొండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపును ఆయన పరిశీలించారు.

చనుగొండ్లలో పర్యటించిన డీఎంహెచ్‌వో

గూడూరు, డిసెంబరు 3: మండలంలోని చనుగొండ్ల గ్రామంలో డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య శుక్రవారం పర్యటించారు. చనుగొండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపును ఆయన పరిశీలించారు. చనుగొండ్ల గ్రామంలో డెంగ్యూ అనుమానిత లక్షణాలున్న కేసులు, జ్వరపీడిత కేసులు నమోదు కాగా.. గ్రామంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. గ్రామంలో జ్వరపీడిత లక్షణాలున్న 50 మంది వరకు శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపామని డీఎంహెచ్‌వో తెలిపారు. అలాగే అవసరమైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశామని తెలిపారు. ఈవోఆర్డీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను చేపట్టారు. అనంతరం గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో రామగిడ్డయ్య సందర్శించి రికార్డులను పరిశీలించారు. అలాగే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ఆరా తీశారు. కార్యక్రమంలో డా.నాగప్రసాద్‌, డా.షభానా అజ్మీ, సూపర్‌వైజర్‌ రాఘవయ్య, పంచాయితీ కార్యదర్శి లక్ష్మీనాథ్‌, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2021-12-04T05:15:10+05:30 IST