DMK: మూడు జిల్లాలకు నిర్వాహకుల ఖరారు

ABN , First Publish Date - 2022-09-30T13:35:27+05:30 IST

డీఎంకే(DMK) సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా అన్ని జిల్లాలకు కొత్త నిర్వాహకుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా,

DMK: మూడు జిల్లాలకు నిర్వాహకుల ఖరారు

                              - అధికారికంగా వెల్లడించిన డీఎంకే


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 29: డీఎంకే(DMK) సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా అన్ని జిల్లాలకు కొత్త నిర్వాహకుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా, విభాగం స్థాయి నుంచి జిల్లా కార్యదర్శి వరకు ఎన్నికలు నిర్వహించగా, ఎంపికలపై ఆ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాల నిర్వాహకుల ఎంపిక జరిగింది. ఇందులో చెన్నై దక్షిణం జిల్లా కార్యదర్శిగా ఎం.సుబ్రమణ్యం(M. Subramaniam) ఎంపికయ్యారు. అలాగే. పార్టీ ప్రిసీడియం అధ్యక్షుడుగా ఎస్‌.గుణశేఖరన్‌, సహాయ కార్యదర్శులుగా విశ్వనాథన్‌, పాలవాక్కం ఎం.మనోహరన్‌, పా.వాసుకి, కోశాధికారిగా ఎస్‌.భాస్కరన్‌ నియమితులయ్యారు. చెన్నై వెస్ట్‌ జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎన్‌.సిట్రరసు, ప్రిసీడియం అధ్యక్షుడుగా టి.విక్టర్‌, సహాయ కార్యదర్శులుగా ఆర్‌ఎన్‌.దురై, వీఎస్‌ కలైసెల్వన్‌, సంగీత, కోశాధికారిగా జేఎస్‌ అగస్టియన్‌ బాబులు ఎంపికయ్యారు. అలాగే, చెన్నై ఈస్ట్‌ జిల్లా కార్యదర్శిగా పీకే శేఖర్‌బాబు, ప్రిసీడియం అధ్యక్షుడుగా కే ఏకప్పన్‌, జాయింట్‌ సెక్రటరీలుగా దేవ జవహర్‌, మహాదేవన్‌, పునితవతి యతిరాజులు, కోశాధికారిగా జడ్‌.అశోక్‌ ఎన్నికయ్యారు. చెన్నై నార్త్‌ జిల్లా పార్టీ కార్యదర్శిగా టి.ఇళంగో, ప్రిసీడియం ప్రెసిడెంట్‌గా ఆర్‌.వెట్రివీరన్‌, జాయింట్‌ సెక్రటరీలుగా ఎస్‌ఆర్‌. కమలకణ్ణన్‌, గోపి, కరుప్పయ్య, కోశాధికారిగా వి.దయాళన్‌ ఎంపికయ్యారు. కాంచీపురం ఉత్తర జిల్లా పార్టీ కార్యదర్శిగా టీఎం అన్బరసన్‌, ప్రిడీసియం అధ్యక్షుడుగా దురైస్వామి, సహాయ కార్యదర్శులుగా కరుణానిధి, టి.మూర్తి, వరలక్ష్మి, కోశాధికారిగా విశ్వనాథన్‌, కాంచీపురం సౌత్‌(Kanchipuram South) జిల్లా పార్టీ కార్యదర్శిగా కె.సుందర్‌, ప్రిసీడియం అధ్యక్షుడుగా ఇనియరసు, సహాయ కార్యదర్శులుగా వి.గోకుల్‌ కన్నన్‌, సెల్వం, మలర్‌విళి, కోశాధికారిగా సన్‌బ్రాండ్‌ ఆర్ముగం, తిరువళ్లూరు సెంట్ర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా నాజర్‌, ప్రిసీడియం ప్రెసిడెంట్‌గా రాజి, సహాయ కార్యదర్శులుగా వీజే శ్రీనివాసన్‌, ఎస్‌.జయపాలన్‌, గాయత్రి శ్రీధర్‌, కోశాధికారిగా నరేష్‌ కుమార్‌, తిరువళ్ళూరు ఈస్ట్‌ జిల్లా పార్టీ కార్యదర్శిగా టీజే గోవింద రాజన్‌, ప్రిసీడియం ప్రెసిడెంట్‌గా పగలవన్‌, సహాయ కార్యదర్శులుగా ఎంఎల్‌ రవి, కదిరవన్‌, ఉమా మహేశ్వరి, కోశాధికారిగా ఎస్‌.రమేష్‏లు ఎంపికైనట్టు డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2022-09-30T13:35:27+05:30 IST