వ్యాయామం ఇలా చేస్తేనే లాభం!

ABN , First Publish Date - 2020-12-17T17:04:55+05:30 IST

బరువు తగ్గాలనే ఆలోచనతో ఉన్నవారు రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. అదొక్కటే కాదు వ్యాయామానికి అంటూ ఒక సమయం

వ్యాయామం ఇలా చేస్తేనే లాభం!

ఆంధ్రజ్యోతి(17-12-2020)

బరువు తగ్గాలనే ఆలోచనతో ఉన్నవారు రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది.  అదొక్కటే కాదు వ్యాయామానికి అంటూ ఒక సమయం పెట్టుకోవడం, రోజూ అదే సమయాన్ని పాటించడం వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉందని తాజాగా ‘ఒబెసిటీ’ జర్నల్‌లో వచ్చిన ఒక అధ్యయనం చెబుతుంది. 


కొన్నాళ్లుగా రోజూ ఒకే వేళకు వ్యాయామం చేస్తూ బరువును నియంత్రణలో ఉంచుకుంటున్న 375 మందిని అధ్యయనం చేశారు. రోజూ ఒకే సమయానికి వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఎక్కువ శ్రమపడతారట. అయితే  ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఏ వేళలో అయినా ఒకే సమయానికి చేయడం వల్ల ఎక్కువ బరువు తగ్గుతారని అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు రోజూ ఒకే సమయానికి ఎక్సర్‌పైజ్‌ చేయడం వల్ల అది ఒక అలవాటుగా మారుతుందని, దాంతో స్వతహాగా వర్కవుట్‌ చేసేందుకు సమయం కేటాయిస్తారని చెబుతున్నారు. 




Updated Date - 2020-12-17T17:04:55+05:30 IST