రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పట్టవా..?

ABN , First Publish Date - 2022-05-23T06:11:56+05:30 IST

స్వరాష్ట్రంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటే పట్టించుకోని సీఎం కేసీర్‌ ఆయా రా ష్ట్రాల్లోని రైతులు ఆదుకునేందుకు ఎలా ఆర్థికసాయం అంది స్తారని జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు ప్రశ్నించారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పట్టవా..?
మాట్లాడుతున్న రైతు ఐక్యవేదిక నాయకులు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతు ఐక్యవేదిక ధ్వజం 

జగిత్యాల అగ్రికల్చర్‌, మే 22: స్వరాష్ట్రంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటే పట్టించుకోని సీఎం కేసీర్‌ ఆయా రా ష్ట్రాల్లోని రైతులు ఆదుకునేందుకు ఎలా ఆర్థికసాయం అంది స్తారని జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు ప్రశ్నించారు. రా ష్ట్రంలోని రైతులను గాలికి వది లేసి, వేరే రాష్ట్రాల్లో రైతులను ఎలా ఆదుకుంటారని రైతు ఐక్య వేదిక నాయకులు ప్రభు త్వాన్ని నిలదీశారు. ఇక్కడి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉం టే ఇక్కడి రైతులకు పై సా చెల్లించకుండా ఇతర రాష్ట్రాల్లోని రైతులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తానని ప్రకటిం చడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి పంజాబ్‌ రైతులకు సహాయం చేస్తానని కేసీఆర్‌ వె ళ్లాడని, అయితే రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ను ఎవరు ఆదుకుంటారో చెప్పాలన్నారు. ఢిల్లీలో పంజాబ్‌ రైతులు నిరసన తెలిసినప్పుడు సీఎం కేసీఆర్‌ ఏ ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్లి సంఘీభావం తెలు పలేదన్నారు. సీఎం కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లో స్థానం సంపాదించుకునేందుకు స్దార్ధం ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు ఆరం భమై 45 రోజులు గడుస్తున్నా నేటికీ 40శాతం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయలేదన్నారు. సీఎం కేసీఆర్‌కు నిజంగా చి త్తశుద్ధి ఉంటే ముందుగా తెలంగాణ రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేయాలని, రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సం ఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్దరణ కమిటీ అధ్యక్షుడు గురిజాల రాజిరెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకులు కొట్టాల మోహన్‌రెడ్డి, బందెల మల్ల య్య, క్యాతం సాయిరెడ్డి,శేర్‌ నర్సారెడ్డి, వేముల కరుణాకర్‌ రెడ్డి, మార్గం నరేష్‌, గణేష్‌, బుచ్చిరెడ్డి, రాజిరెడ్డి, వేముల విక్రంరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2022-05-23T06:11:56+05:30 IST