జీపీలకు సొంత భవనాలేవీ?

ABN , First Publish Date - 2020-10-11T10:01:01+05:30 IST

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోంది.

జీపీలకు సొంత భవనాలేవీ?

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు కరువు

ఉభయ జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన 334 గ్రామ పంచాయతీలు

కామారెడ్డి జిల్లాలో 214, నిజామాబాద్‌ జిల్లాలో 120 కొత్త జీపీల ఏర్పాటు

అద్దెభవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనే కార్యకలాపాలు 

పాలకులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు


కామారెడ్డి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోంది. కానీ కొత్త గ్రామ పంచాయతీలకు కనీసం సొంత భవనాలు కరువవుతున్నాయి. అ ధికారులు, పాలకులు అభివృద్ధి, సమ స్యలపై చర్చించేందుకు సొంతభవనా లు లేక అద్దెభవనాలు, ఇరుకు గదు లలోనే సమావేశాలు ఏర్పాటు చేసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉ మ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కొత్త గ్రామ పంచాయతీలలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రజలకు మెరుగైన పా లన అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభు త్వం 500లకు పైగా జనాభా కలిగిన గ్రామాల ను గుర్తించి 2018లో నూతన గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేసింది.


ఆయా గ్రామాల్లో అద్దె భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పా ఠశాలలో తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను సైతం నియమించింది. గత ఏ డాది జనవరిలో పంచాయతీలకు ఎన్నికలు సైతం ని ర్వహించారు. ఎన్నికైన పాలకవర్గం సభ్యులు ఫిబ్రవ రిలో ప్రమాణస్వీకారం చేసి భాద్యతలు చేపట్టినా కానీ ఇప్పటికి పంచాయతీలకు సొంత భవనాలు లే కపోవడంతో ఇరుకైన గదులతో అరకొర వసతుల మధ్య సమావేశాలు నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదు రవుతున్నాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.


ఉమ్మడి జిల్లాలో 334 కొత్త జీపీలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వం కొత్తగా 334 కొత్త జీపీలను ఏర్పాటు చే సింది. నిజామాబాద్‌ జిల్లాలో పాత గ్రామ పం చాయతీలు 410 ఉండగా.. కొత్తగా 120 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో జి ల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో పాత గ్రా మ పంచాయతీలు 312 ఉండగా.. కొత్తగా 214 జీపీలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలు అ య్యాయి. ఉభయ జిల్లాల్లోని పాత గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పడిన జీపీలను కార్యాలయల సమస్య తీవ్రం గా వేధిస్తోంది. ప్రభుత్వం నూతన పంచాయతీలకు భవనాలు మం జూరు చేసినప్పటికీ నిర్మాణాలు జరగడం లేదు. ఫలితంగా శిధిలా వస్థకు చేరిన, అసౌకర్యాలతో కూ డిన భవనాలతో పాలకులకు ఇబ్బ ందులు తప్పడం లేదు. మరికొన్ని గ్రామాల్లో అద్దె భవనాలు లేని ప్రా ంతాల్లో గ్రామస్థుల సహకారంతో తా త్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లలోనే పంచాయతీలు కొనసాగుతున్నాయి.దీంతో అరకొర వసతులతో సర్పంచ్‌లు, పాలకులకు ఇ బ్బందులు తప్పడం లేదు. 


నూతన జీపీలలో గ్రామసభలకు చోటు కరువు

నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ పాలకవర్గా లు ప్రతీ రెండు నెలలకోసారి గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదే శాలు జారిచేసింది. లేని పక్షంలో గ్రామ సర్పంచ్‌లను పదవికి అనర్హడిగా ప్రకటించాలని పేర్కొంది. గ్రామసభ నిర్వహించాలంటే గ్రామాల్లోని ఓటర్లం తా గ్రామసభలో సభ్యులే, గ్రామసభలకు పాలకవర్గ సభ్యులతో పాటు కనీ సం 50 మంది గ్రామస్థులు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కొత్త పం చాయతీలకు పాతభవనాలు లేకపోవడమే కాకుండా ఉన్న తాత్కాలిక భవ నాలు ఇరుకుగా ఉండడంతో గ్రామసభలు నిర్వహించడానికి ఇబ్బందులు త ప్పడం లేదు. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలను మంజూరుచేసి పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామస్థుల కష్టాల ను తీర్చాలని ఉమ్మడి జిల్లాలోని కొత్త గ్రామాల సర్పంచ్‌లు కోరుతున్నారు.


నూతన భవనం నిర్మించాలి- అనిల్‌కుమార్‌, సర్పంచ్‌, వజ్జెపల్లి గ్రామం

ప్రభుత్వం వజ్జెపల్లి గ్రామాన్ని కొత్త జీపీగా ఏర్పాటు చేసిన తర్వాత పంచాయతీ కార్యాల యాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఒకే ఒక గది ఉండడంతో సభలు సమావేశాల కు ఇబ్బందవుతోంది. ప్రజప్రతినిధులు స్పందిం చి నూతన భవనం మంజూరు చేసి త్వరగా ని ర్మాణం చేపట్టాలి. పల్లెప్రగతి కార్యక్రమంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయాల భవనాల ని ర్మాణాలు చేపడితే బాగుంటుంది.

Updated Date - 2020-10-11T10:01:01+05:30 IST