MP Salary: లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయితే.. ఆ సమయంలో వారికి జీతం ఇస్తారా..?

ABN , First Publish Date - 2022-07-27T22:37:31+05:30 IST

పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.

MP Salary: లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయితే.. ఆ సమయంలో వారికి జీతం ఇస్తారా..?

పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఛైర్మన్ వారిస్తున్నప్పటికీ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తున్నారు. లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. సభా మర్యాదను ఉల్లంఘించేలా ప్రవర్తించినందుకు ఇప్పటివరకు 24 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. 


ఇది కూడా చదవండి..

Wife Missing: నా భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త ఫిర్యాదు.. జైపూర్ నుంచి తీసుకొచ్చిన పోలీసులు.. ఎందుకు వెళ్లావని అతడు నిలదీస్తే..


పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో ఎంపీలు నెల వేతనం లక్ష రూపాయలుగా ఉంది. ఇంటి అద్దె, ఆఫీసు ఖర్చు, ఇతర అవసరాలకు సంబంధించి ప్రతీ నెలా మరో 2 లక్షల రూపాయల వరకు అలవెన్సు రూపంలో వస్తుంది. ఒకవేళ ఎంపీలు సభ నుంచి సస్పెన్షన్‌కు గురి అయితే వీటిల్లో కోత పడుతుందా..? లేదా..? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీలు కూడా పూర్తి జీతం అందుకుంటారు. వారి జీతంలో కానీ, ఇతర అలవెన్సుల్లో కానీ ఎలాంటి కోతా ఉండదు. `పని లేదు.. వేతనం లేదు' అనే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా భావిస్తున్నాయి. అయితే ఆ విధానం ఇంకా అమల్లోకి రాలేదు.

Updated Date - 2022-07-27T22:37:31+05:30 IST