మూడో డోసు అవసరమా?

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

ఒక్క డోసుతో సరిపెట్టుకోవడం, డోసుల మధ్య వ్యవధి పెంచడం, కొవిడ్‌ సోకిన వాళ్లకు వ్యాక్సిన్‌ అవసరం లేదని

మూడో డోసు అవసరమా?

ఒక్క డోసుతో సరిపెట్టుకోవడం, డోసుల మధ్య వ్యవధి పెంచడం, కొవిడ్‌ సోకిన వాళ్లకు వ్యాక్సిన్‌ అవసరం లేదని చెప్పడం... ఇలా వ్యాక్సిన్‌ గురించిన గందరగోళం నుంచి మన దేశం ఇంకా తేరుకోక ముందే, కొన్ని దేశాలు డెల్టా వేరియెంట్‌ నుంచి తమ ప్రజల ఇమ్యూనిటీ పెంచడం కోసం, మూడో బూస్టర్‌ డోస్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. భారతదేశంలో మొట్టమొదట వెలుగుచూసిన కొవిడ్‌ - 19 డెల్టా వేరియెంట్‌ మున్ముందు డామినెంట్‌ స్ట్రెయిన్‌గా రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ప్రస్తుత ఆల్ఫా, బీటా స్ట్రెయిన్ల నుంచి సమారు 90ు మేరకు రక్షణ కల్పించగలిగినా, డెల్టా వేరియెంట్‌ విషయంలో పరిమిత రక్షణకే పరిమితమవుతాయని ఇప్పటివరకూ జరిపిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి కొత్త కొవిడ్‌ వేరియెంట్‌ నుంచి రక్షణ కల్పించే ఇమ్యూనిటీని పెంచాలంటే తప్పనిసరిగా మూడో బూస్టర్‌ డోస్‌ తీసుకోవలసి ఉంటుంది. ఈ దిశగా ఇప్పటికే ఇంగ్లండ్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.


Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST