కాలుష్య కంపెనీలకు అనుమతులివ్వొద్దు : కుంభం

ABN , First Publish Date - 2022-09-26T05:40:23+05:30 IST

కాలుష్య కంపెనీలను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు వారంరోజులుగా నిరసనలు, దీక్షలు చేపడుతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం సరికాదని, సదరు కాలుష్య కంపెనీకి అనుమతులివ్వొద్దని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

కాలుష్య కంపెనీలకు అనుమతులివ్వొద్దు : కుంభం
సమావేశంలో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 25: కాలుష్య కంపెనీలను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు వారంరోజులుగా నిరసనలు, దీక్షలు చేపడుతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం సరికాదని, సదరు కాలుష్య కంపెనీకి అనుమతులివ్వొద్దని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామస్థులు సిద్దం రిసోర్స్‌ ప్రైవేటు కంపెనీ లిమిటెడ్‌ ఏర్పాటును నిరసిస్తూ ఆదివారం వంటావార్పు, దీక్షలు చేపట్టారు. దీక్షాశిబిరాన్ని అనిల్‌ సందర్శించి స్థానిక ప్రజాప్రతినిధుల తీరును ఎండగట్టారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు, వైఎ్‌సఆర్‌టీపీ జిల్లా కన్వీనర్‌ ఎండీ అతహర్‌ దీక్షలకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నేతలు  కోటపెద్దస్వామి, వల్లందాసు ఆదినారాయణ, నుచ్చు నాగయ్య,చిక్కుల వెంకటేశ్‌, నానం కృష్ణ, ఎల్లంల జంగయ్య, జేఏసీ నాయకులు రత్నపురం శ్రీనివాస్‌, సురేందర్‌, ప్రవీణ్‌రెడ్డి, యాదేశ్‌, బాలకృష్ణ, ఉప్పలయ్య, పి వీరేశ్‌, ఎన్‌ సత్యనారాయణ, మహేశ్‌ యాదవ్‌, సత్తయ్య, తదితరులున్నారు.  

Updated Date - 2022-09-26T05:40:23+05:30 IST