కొవిడ్‌ వ్యాక్సిన్‌పై భయం వద్దు

ABN , First Publish Date - 2021-01-22T03:57:00+05:30 IST

కరోనా నిర్మూలన కోసం ప్రవేశ పెట్టబడిన వ్యాక్సిన్‌ పట్ల భయం అవసరం లేదని, అన్ని పరీక్షల తర్వాతే వ్యాక్సిన్‌ను విడుదల చేశారని పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీకాంత్‌ అన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై భయం వద్దు
టీకా తీసుకుంటున్న బోయిన్‌పల్లి అంగన్‌వాడీ కార్యకర్త

నారాయణపేటరూరల్‌, జనవరి 21 : కరోనా నిర్మూలన కోసం ప్రవేశ పెట్టబడిన వ్యాక్సిన్‌ పట్ల భయం అవసరం లేదని, అన్ని పరీక్షల తర్వాతే వ్యాక్సిన్‌ను విడుదల చేశారని పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీకాంత్‌ అన్నారు. గురువారం మండలంలోని కోటకొండ పీహెచ్‌సీలో రెండో రోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. మొత్తం 48మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో సీడీపీవో జయ, హెల్త్‌ అసిస్టెంట్‌, పీహెచ్‌ఎన్‌ సునంద, వ్యాక్సినేటర్‌ యశోద తదితరులు పాల్గొన్నారు.

మక్తల్‌ : గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సిద్దప్ప వ్యాక్సిన్‌ వేసుకున్నారు. శుక్రవారంతో మక్తల్‌ మండల పరిధిలో వైద్య సిబ్బందికి టీకా వేసే కార్యక్రమం ముగుస్తుందన్నారు. అనంతరం మునిసిపల్‌ కార్మికులు, పోలీస్‌ సిబ్బందికి, జర్నలిస్టులతోపాటు దశలవారీగా ప్రజలందరికి టీకా వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో వైద్యసిబ్బంది శ్రీధర్‌కుమార్‌, సుజాత, యాదగిరి, సత్యనారాయణమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-22T03:57:00+05:30 IST