కరోనాపై నిర్లక్ష్యంగా ఉండొద్దు

ABN , First Publish Date - 2021-04-24T04:54:40+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, స్వీయ జాగ్రత్తలు, మాస్కులు, శానిటైజర్లతోనే అది సాధ్యమవుతుందని కడప డీఎస్పీ బి.సునీల్‌ పిలుపునిచ్చారు.

కరోనాపై నిర్లక్ష్యంగా ఉండొద్దు
కోటిరెడ్డిసర్కిల్‌లో డీఎస్పీ, పోలీసులు

స్వీయ జాగ్రత్తలతోనే కట్టడి 

కడప డీఎస్పీ సునీల్‌

కడప(క్రైం), ఏప్రిల్‌ 23: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, స్వీయ జాగ్రత్తలు, మాస్కులు, శానిటైజర్లతోనే అది సాధ్యమవుతుందని కడప డీఎస్పీ బి.సునీల్‌ పిలుపునిచ్చారు. నగరంలో సీఐలు టీవీ సత్యనారాయణ, నాగభూషణం, మహ్మద్‌ అలీ, సత్యబాబులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కడప డీఎస్పీ మాట్లాడుతూ రెండో దశలో కరోనా విజృంభిస్తోందని, ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. బయటికి వెళ్లాల్సి వస్తే మాస్కులు, శానిటైజర్లు వినియోగించడంతో పాటు భౌతికదూరాన్ని పాటించాలన్నారు. నేటి నుంచి ఎవరూ రాత్రిళ్లు బయట తిరగవద్దని, తిరిగితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కరోనాపై అవగాహన కల్పించేలా లఘుచిత్రం ప్రదర్శించారు. ప్రతిఒక్కరూ టీకాను వేయించుకోవాలని సూచించారు. మీరు చేసే నిర్లక్ష్యం కారణంగానే విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా కోటిరెడ్డిసర్కిల్‌ నుంచి ఎర్రముక్కపల్లె, వన్‌టౌన్‌ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, సెవెన్‌రోడ్స్‌, బీకేఎం స్ర్టీట్‌, అప్సరా సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో లఘుచిత్రం ప్రదర్శించారు. 



Updated Date - 2021-04-24T04:54:40+05:30 IST