‘ఉద్యోగాల పేరిట మోసపోవద్దు’

ABN , First Publish Date - 2021-12-04T05:22:44+05:30 IST

పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు ఇస్తామంటూ పేపర్లలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రమణయ్య శుక్రవారం అన్నారు.

‘ఉద్యోగాల పేరిట మోసపోవద్దు’

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 3: పశుసంవర్థక శాఖలో ఉద్యోగాలు ఇస్తామంటూ పేపర్లలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ రమణయ్య శుక్రవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటూ గ్రామీణ పశుపాలన నిగమ్‌ లిమిటెడ్‌ పేరుతో పత్రికా ప్రకటనల్లోనూ, యూట్యూబ్‌, సోషల్‌ మీడియాల్లోనూ ప్రకటనలు జోరుగా వస్తున్నాయని తెలిపారు. ఇవన్నీ కూడా నిరుద్యోగులను మోసం చేయడానికే అని గుర్తించాలన్నారు. అలాంటి ఉద్యోగాలు పశుసంవర్థకశాఖలో ఏమీ లేవని తెలిపారు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమచారం ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించి పారదర్శకంగా భర్తీ చేస్తారని తెలిపారు. పశుసంవర్థకశాఖలో పదో తరగతి విద్యార్హతతో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందని, కర్నూలుతో పాటు వివిద జిల్లాలో వీరు నిరుద్యోగులతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పశుసంవర్థకశాఖలో ప్రస్తుతం ఎటువంటి ఖాళీలు భర్తీ చేయడం లేదని తెలిపారు. నిరుద్యోగులు పేపర్లలో వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని సూచించారు. తమ శాఖ కార్యాలయాల్లో అధికారులను కలిసి పేపరు ప్రకనటనలు వాస్తవమో కాదో విచారించుకోవాలని సూచించారు.

Updated Date - 2021-12-04T05:22:44+05:30 IST