పన్నుల వసూళ్లలో..నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2022-06-25T04:45:11+05:30 IST

మునిసిపాలిటీకి రావా ల్సిన పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం వహించవద్దని వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అధికారు లను ఆదేశించారు.

పన్నుల వసూళ్లలో..నిర్లక్ష్యం వద్దు
మునిసిపల్‌ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ గట్టు యాదవ్‌

వనపర్తి టౌన్‌, జూన్‌ 24: మునిసిపాలిటీకి రావా ల్సిన పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం వహించవద్దని వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కమిషనర్‌ చాంబర్‌లో ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు, చెత్త సేవ పన్నుల వసూళ్లపై సంబంధిత ఇంజనీరింగ్‌, రెవెన్యూ, శాని టేషన్‌ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ట్రేడ్‌ లైసెన్స్‌లు ప్రతీ ఒక్క వ్యాపార యజ మానులకు అందించాలని, లైసెన్స్‌లు ఉన్నవారికి రెన్యూవల్‌ చేయాలన్నారు. ఆస్తి పన్ను చెల్లింపు విష యంలో మొండి బకాయి దారులపై ప్రభుత్వ నిబం ధనల ప్రకారంగా కఠినంగా వ్యవహరించాలని ఆదే శించారు. 2022-23 సంవత్సరానికి చెందిన ఆస్తి, నల్లా, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు, చెత్త సేవ (యూజర్‌ చార్జీలు) వంటి తదితర పన్నులను 100 శాతం పూర్తి చేయాలన్నారు. పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  సమావేశంలో మునిసి పల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ విక్రమ సింహరెడ్డి, మేనేజర్‌ ఖాజా, రెవెన్యూ అధికారి అనిల్‌ కుమార్‌, శానిటరీ ఇన్సూపెక్టర్‌ రమేష్‌, బిల్‌ కలెక్టర్లు, వాటర్‌మెన్‌లు, శానిటరీ జవాన్‌లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-25T04:45:11+05:30 IST