కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మద్దు

ABN , First Publish Date - 2021-04-23T04:59:17+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పై అపోహలు నమ్మవద్దని గాలివీడు ప్రభుత్వ వైద్యాధికారి స్రవంతిరెడ్డి పేర్కొన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మద్దు

గాలివీడు, ఏప్రిల్‌22: కొవిడ్‌ వ్యాక్సిన్‌ పై అపోహలు నమ్మవద్దని గాలివీడు ప్రభుత్వ వైద్యాధికారి స్రవంతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు వేసుకున్న వారు 28 రోజుల తరువాత రెండో డోసు వేయాల్సి ఉండగా ప్రభుత్వం దానిని కోవ్యాక్సిన్‌ అయితే 4 నుంచి 6 వారాలకు, కోషీల్డ్‌ అయితే 6 నుంచి 8 వారాలకు మార్పు చేయడం జరిగిందన్నారు.  ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్లను వాడి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. 

Updated Date - 2021-04-23T04:59:17+05:30 IST