యాదాద్రీశుడి భక్తులకు ఇబ్బంది కలగనివ్వం

ABN , First Publish Date - 2022-05-22T05:42:01+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తు లు ఇబ్బంది పడకుండా అన్నీ రకాల మౌలిక వసతులు కల్పించనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమా ర్‌ తెలిపారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని శనివారం ఆయ న సందర్శించి మౌలిక సదుపాయాల పురోగతి, నిర్వహణ తీరును దేవస్థాన ఈవో గీతారెడ్డిని అడిగి తెలుసుకున్నా రు.

యాదాద్రీశుడి భక్తులకు ఇబ్బంది కలగనివ్వం
ఆలయ తిరువీధుల్లో పర్యటిస్తూ పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ అనీల్‌కుమార్‌

కొండపై చలువపందిళ్లు, కార్పెట్లు ఏర్పాటు చేశాం

ఉద్ఘాటన అనంతరం భక్తుల తాకిడి పెరిగింది 

ఈ నెల 25వ తేదీ నాటికి బస్‌ టెర్మినల్‌ సిద్ధం

దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌


యాదగిరిగుట్ట, మే 21: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తు లు ఇబ్బంది పడకుండా అన్నీ రకాల మౌలిక వసతులు కల్పించనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమా ర్‌ తెలిపారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని శనివారం ఆయ న సందర్శించి మౌలిక సదుపాయాల పురోగతి, నిర్వహణ తీరును దేవస్థాన ఈవో గీతారెడ్డిని అడిగి తెలుసుకున్నా రు. ప్రధానాలయం, ఆలయ అష్టభుజి ప్రాకార మండపాలు, తిరువీధులు, దర్శన క్యూకాంప్లెక్స్‌, శివాలయం, మెట్ల దారి, ప్రసాదాల తయారీ భవనం, బస్‌ టెర్మిన ల్‌, పార్కింగ్‌ తదితర ప్రాంతాల్లో కలియదిరిగి పనులను పరిశీలించారు. ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ, దేవస్థాన, ఈసీఐఎల్‌ అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ఉద్ఘాటన అనంతరం స్వయంభువుల దర్శనానికి భక్తుల తాకిడి పెరిగిందన్నారు. వేసవి కావడం, ఎండలు తీవ్రరూ పం దాల్చుతుండడంతో కొండపైన సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

కొండపై చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పించాలని, సరిపడా మరుగుదొడ్లను నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన తొమ్మిది వాటర్‌ ఫిల్టర్‌ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేశామని, మరో 10 వాటర్‌ ఫిల్టర్‌ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ తిరువీధుల్లో నడిచే భక్తులు ఎం డ నుంచి ఉపశమనం పొందేందు కు కార్పెట్లను ఏర్పాటుచేశామన్నారు. ఆలయ తిరువీధుల్లోని కృష్ణరాతి శిలలపై  ఎండలో నడుచుకుంటూ వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందజేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్రాలను వినియోగిస్తున్నామని, పులిహోర, లడ్డూ, వడ ప్రసాదాల తయారీని పరిశీలించినట్లు చెప్పారు. యంత్రాల పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతులు చేపట్టేందుకు నిపుణులను సిద్ధంగా ఉంచామన్నారు. కొండపైన ఉత్తరదిశలోని బస్‌టెర్మినల్‌, కొండకింద గండి చెరువు సమీపంలోని ఆర్టీసీ బస్టాండ్‌ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నామని, బస్‌టెర్మినల్‌ ఈ నెల 25వ తేదీ నాటికి సిద్ధం కానుందన్నారు. కొండకింద బస్టాండ్‌ పనులను ఈ నెలాఖరులోగా సివిల్‌ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆలయ తిరువీఽధుల్లో భక్తులకోసం ఏర్పాటు చేసిన వాటర్‌ ఫిల్టర్‌ ఫ్రిజ్‌లో నీటిని అనిల్‌కుమార్‌ తాగి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనవెంట ఈఈలు వెంకటేశ్వర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, డీఈ మహిపాల్‌రెడ్డి, ఏఈ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్టీసీ అధికారులు తదితరులున్నారు.

Updated Date - 2022-05-22T05:42:01+05:30 IST