రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు

ABN , First Publish Date - 2022-05-28T05:35:17+05:30 IST

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వస్తే అధికారులు, రైస్‌మిల్లర్స్‌ కలిసి ఇబ్బందులకు గురి చేయరాదని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు
పెద్దనక్కలపేటలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న లక్ష్మణ్‌కుమార్‌

డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, మే 25: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వస్తే అధికారులు, రైస్‌మిల్లర్స్‌ కలిసి ఇబ్బందులకు గురి చేయరాదని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని పెద్దనక్కలపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం నిల్వలు పరిశీలించిన ఆయన రైతుల సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులు తూకం చేసి ఉంచిన సంచులకు చెదలు పట్టినట్లు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో రైతుల నుంచి తరుగు పేరట కోత విధించరాదని ఆయన అన్నా రు. ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యం కొనాలని డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌పోర్టు విషయంలో ఇబ్బందులకు గురి చేయరాదని, రైస్‌మి ల్లర్లు కూడ రైతులను పలు కారణాలతో ఇబ్బందులకు గురి చేయవద్దని ఆయన తెలిపారు. ఒకవైపు అకాల వర్షం, మరొక వైపు కొనుగోలు కేంద్రా ల్లో అధికారుల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన ఫోన్‌ ద్వా రా కలెక్టర్‌, డీసీవో దృష్టికి తీసుక వెళ్లారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్‌ వెంకటేష్‌ కొనుగోలు కేంద్రానికి చేరుకుని కొనుగోళ్లు వేగవంతం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కొనుగోలు కేం ద్రాల వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28న శనివారం ఉదయం అంబేద్కర్‌ విగ్రహ చౌరస్తా వద్ద తాను ఒక రోజు ని రసన దీక్ష చేపట్టుతానని లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. ఈ దీక్ష విరమణకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరవుతారన్నారు. నియోజకవర్గ స్థాయిలోని  రైతు లు దీక్షా కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఆయన వెంట ధర్మపురి మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు వేముల రాజేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కుంట సుధాకర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు చిలుముల లక్ష్మణ్‌, బాదినేని సత్యనారాయణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్‌, మండల అధ్యక్షులు  రాందేని మొగిలి, నల్ల శ్రీహరి, రమేష్‌ పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-28T05:35:17+05:30 IST