ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2021-09-19T05:46:24+05:30 IST

జిల్లాలో ఎయిడెడ్‌ విద్యా సంస్థలను పరిరక్షిం చాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్‌ హైస్కూల్‌ ఎదుట శనివా రం ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో ప్రజలకు విద్యనందించేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారన్నారు.

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పరిరక్షించాలి
వీఆర్‌ హైస్కూల్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

వీఆర్‌ స్కూల్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన

నెల్లూరు (విద్య), సెప్టెంబరు 18 : జిల్లాలో ఎయిడెడ్‌ విద్యా సంస్థలను పరిరక్షిం చాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్‌ హైస్కూల్‌ ఎదుట శనివా రం ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో ప్రజలకు విద్యనందించేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఆ సంస్థలను నేడు రాష్ట్ర ప్రభుత్వం మూసివేసేందుకు ప్రయత్నాలు చేపట్టడం అన్యాయమన్నారు. ప్రభుత్వ చర్యలతో వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని, ఆ జీవోలను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు సందీప్‌, వెంకయ్య, ప్రదీప్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T05:46:24+05:30 IST