బొబ్బిలి, జనవరి 23: స్థానిక ఏపీఐఐసీ (గ్రోత్‌సెంటరు) భూముల్లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులెవరూ పంటలను సాగు చేయరాదని ఆ సంస్థ జోనల్‌మేనేజరు సుధాకర్, డీజెడ్‌ఎం వరప్రసాద్ హెచ్చరించారు. శనివారం ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పరి శ్రమలు ఏర్పాటు కాని కారణంగా మెట్టవలస, పెంట, గొర్లె సీతారాంపురం, ఎం.బూర్జివలస, పనుకువలస గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను దున్నరాదని తెలిపారు. పరి శ్రమల ఏర్పాటు కోసం భూములను పొందిన వారు ఇంకా పరి శ్రమలు స్ధాపించకుండా ఉంటే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.