స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దు

ABN , First Publish Date - 2021-06-17T05:09:46+05:30 IST

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన చెక్‌పోస్టువద్ద తనిఖీల్లో స్థానికులను ఇబ్బం దులకు గురిచేయవద్దని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు.

స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దు
ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌

- ఆధార్‌ కార్డును చూసి అనుమతించండి

-  ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఏ. సంపత్‌కుమార్‌


ఉండవల్లి, జూన్‌ 16 : లాక్‌డౌన్‌ అమలులో భాగంగా పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన చెక్‌పోస్టువద్ద తనిఖీల్లో స్థానికులను ఇబ్బం దులకు గురిచేయవద్దని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. బుధవారం పు ల్లూరు టోల్‌ప్లాజా దగ్గర సంపత్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి కొద్దిసేపు ఆందోళన చేశా రు. ఈ సందర్భంగా ఆయన ఏఆర్‌ డీఎస్పీ సత్య నారాయణ, సీఐ వెంకటేశ్వర్లుతో మాట్లాడుతూ అలంపూర్‌ నియోజకవర్గ ప్రజలు నిత్యం కర్నూలు కు వెళ్తుతుంటారని, తిరుగు ప్రయాణంలో పోలీసు లు ఈ పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి స్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ముఖ్యంగా వైద్యం, వ్యవసాయ సంబంధిత, నిత్యా వసరాలు, ఉపాధి కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థ ల్లో పనిచేసే ఉద్యోగస్తులు నిత్యం కర్నూలు వెళ్లి వస్తుంటారని తెలిపారు లాక్‌డౌన్‌ నిబంధనలతో తనిఖీల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజ లను ఆధార్‌కార్డు గానీ, ఏదైనా గుర్తింపు కార్డు చూసి రాకపోకలకు అనుమతించాలని కోరారు. సీఐ మాట్లాడుతూ అత్యవసర పనులమీద వెళ్లే వారిని అనుమతిస్తున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ పాసు ఉన్న వాహనాలను తెలంగా ణలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. ఈ సంద ర్భంగా సంపత్‌కుమార్‌ ఫోన్‌లో జిల్లా ఎస్పీ రంజ న్‌ రతన్‌కుమార్‌తో మాట్లాడుతూ రైతులకు, నిరక్ష రాస్యులకు, సామాన్యులకు ఈ పాసుపై ఎటువం టి అవగాహన ఉండదని, వర్ష్షాకాలం కావడంతో రైతులు విత్తనాలు, ఎరువులకోసం కర్నూలు వెళ్తుం టారని తెలిపారు. స్థానికులను ఆధార్‌కార్డును చూ సి రాకపోకలకు అనుమతించాలని కోరారు. కరోనా కట్టడిలో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నామ ని, అత్యవసర పనులకు వెళ్లే వారిని, రైతులను అనుమతిస్తున్నామని, స్థానికుల సమస్యను పరిష్క రిస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విర మించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బొంకూర్‌ గోపాల్‌రెడ్డి, శ్యాం, మద్దిలేటి, రవి, పాండు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:09:46+05:30 IST