లైసెన్సు లేకుండా వాహనాలు నడపొద్దు

ABN , First Publish Date - 2022-08-19T04:51:40+05:30 IST

ఎలాంటి పర్మిట్‌ లేకుండా వాహనాలు నడిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ జయరాములు తెలిపారు. మండల కేంద్రంలోని రామాపురం మూడు రోడ్ల కూడలి వద్ద గురువారం సాయంత్రం వాహనాలను ఆయన తనిఖీ చేశారు.

లైసెన్సు లేకుండా వాహనాలు నడపొద్దు
డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ

రామాపురం, ఆగస్టు 18: ఎలాంటి పర్మిట్‌ లేకుండా వాహనాలు నడిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ జయరాములు తెలిపారు. మండల కేంద్రంలోని రామాపురం మూడు రోడ్ల కూడలి వద్ద గురువారం సాయంత్రం వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు, టూవీర్ల యజమానులకు ఆయన అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలన్నారు. ప్రతిఒక్కరూ హెల్మెట్‌ ధరించాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:51:40+05:30 IST