మోటార్లకు మీటర్లు బిగించొద్దు

ABN , First Publish Date - 2022-08-18T06:00:53+05:30 IST

మోటార్లకు మీటర్లు బిగించొద్దు

మోటార్లకు మీటర్లు బిగించొద్దు
గృహ నిర్బంధంలో ఆళ్ల

 విజయవాడ సీపీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం వద్ద

రైతు సంఘాల ధర్నా.. వెళ్లకుండా ఆళ్ల గోపాలకృష్ణ గృహ నిర్బంధం 

హనుమాన్‌జంక్షన్‌, ఆగస్టు 17: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించొద్దని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాం డ్‌ చేశారు.  మోటార్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపును నిరసిస్తూ బుధ వారం విజయవాడ సీపీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్ల కుండా హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు నోటీసులు ఇచ్చి ఆయనను గృహ నిర్బంధం చేశారు. రైతు సంఘాల ఉద్య మాలను గృహ నిర్బంధాలతో అపలేరని ఆళ్ల వారిని హెచ్చ రించారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నెం22పై  ప్రజా స్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. నగదు బదిలీపై రైతులతో విద్యుత్‌ అధికారులు బలవంతంగా అంగీకార పత్రాలు తీసుకోవడం దారుణమన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో లక్ష పంపుసెట్లు ఉన్నాయని ఒకేతాటిపై నిలబడి స్మార్టు మీటర్ల బిగింపును రైతులంతా వ్యతిరేకించాలని ఆళ్ల గోపాలకృష్ణ సూచించారు.



Updated Date - 2022-08-18T06:00:53+05:30 IST