చాణక్యనీతి: మీకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే... ఈ పనులు చేశాక తల స్నానం చేయండి!

ABN , First Publish Date - 2022-06-12T14:37:55+05:30 IST

ఆచార్య చాణక్యుడు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు

చాణక్యనీతి: మీకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే... ఈ పనులు చేశాక తల స్నానం చేయండి!

ఆచార్య చాణక్యుడు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. అయితే ఆ పోరాటాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. తన బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాడు. ఆచార్య చాణక్యుడి తెలివితేటలు ఒక సాధారణ పిల్లవాడిని చక్రవర్తిగా మార్చాయి. నేటికీ ఆచార్య చాణక్య ఉత్తమ జీవిత మార్గదర్శిగా కనిపిస్తారు. ఆయన వచనాలు ప్రజలకు స్ఫూర్తిదాయకం. ఆచార్య తన చాణక్య నీతి  గ్రంథంలో ఒక శ్లోకం ద్వారా మూడు పనుల గురించి వివరించి, ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలని చెప్పారు. 


అప్పుడే అతని శరీరం స్వచ్ఛంగా మారుతుంది. లేకపోతే అతని ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఒక శ్లోకంలో చాణక్య తొలుత చెప్పినది ఆయిల్ మసాజ్. ఆయిల్ మసాజ్ శరీరానికి మంచిదని, క్రమం తప్పకుండా చేయాలని ఆచార్య తెలిపారు. అయితే ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. లేదంటే ఆ నూనెతో మురికి చేరి శరీరానికి హాని కలిగిస్తుంది. అందువల్ల ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత తలస్నానం చేయాలి. దహన సంస్కారాల నుండి వచ్చిన తర్వాత స్నానం చేయడం చాలా ముఖ్యం. శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేస్తారు. అలాంటప్పుడు అక్కడి బ్యాక్టీరియా అక్కడుండేవారి శరీరంపై అంటుకుంటుంది. అందుకే శ్మశానవాటిక నుండి వచ్చిన తరువాత, తప్పనిసరిగా స్నానం చేయాలి. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు కత్తిరించిన తర్వాత తలస్నానం చేయాలి. క్షవరం చేయించుకున్నాక శరీరానికి చిన్న చిన్న వెంట్రుకలు అంటుకుంటాయి. కొన్నిసార్లు అవి ఆహార పదార్థాల్లో పడి, మీ శరీరంలోకి చేరుకుంటాయి. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. అందుకే మీ జుట్టు కత్తిరించిన వెంటనే తలస్నానం చేయాలి. 

Updated Date - 2022-06-12T14:37:55+05:30 IST