అనుమతులు మంజూరు చేయొద్దు

ABN , First Publish Date - 2022-06-29T04:34:52+05:30 IST

జిల్లాలో కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ కింద నిర్ణయించిన గ్రామాల్లో మైనింగ్‌ శాఖతో పాటు ఇతర శాఖలు ఎటువంటి భారీ పరిశ్రమలు స్థాపించడానికి అనుమతి మంజూరు చేయొద్దని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు

అనుమతులు మంజూరు చేయొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 28: జిల్లాలో కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ కింద నిర్ణయించిన గ్రామాల్లో మైనింగ్‌ శాఖతో పాటు ఇతర శాఖలు ఎటువంటి భారీ పరిశ్రమలు స్థాపించడానికి అనుమతి మంజూరు చేయొద్దని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అటవీ శాఖాధికారి శాంతారాం, అదనపు కలెక్టర్‌ రాజేశం, ఎప్డీఓ దినేష్‌కుమార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవ్వాల్‌ కోర్‌ ఏరియ ప్రాంతాన్ని మరింత విస్తరించడం జరుగుతుందని చెప్పారు. దీనిలో భాగంగా సిర్పూర్‌(యూ) మండలంలోని రాజుగేడ, తుత్తుగూడ గ్రామాలను ఎకోసెన్సిటీవ్‌ జోన్‌గా గుర్తించామని తెలి పారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిర శమలకు అనుమతించకూడదన్నారు. దీని వల్ల పర్యావరణం చెడి పోయే అవకాశం ఉంటుందన్నారు.  సమావేశంలో పంచాయతీరాజ్‌ ఈఈ రామ్మోహన్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T04:34:52+05:30 IST